CBI Recruitment: నిరుద్యోగులకు ఇది గోల్డెట్ అపార్చునిటీ అని చెప్పవచ్చు. ఏదైనా యూనివర్సిటీలో డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ముంబైలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభిస్తుంది. దరఖాస్తుకు ఇంకా రెండు రోజుల ఛాన్స్ మాత్రమే ఉంది.
ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) రెగ్యులర్ ప్రాతిపదికన క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 20వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1000
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
కేటగరీ వారీగా ఉద్యోగ ఖాళీలు
ఎస్సీ: 150 ఉద్యోగాలు
ఎస్టీ: 75 ఉద్యోగాలు
ఓబీసీ: 270 ఉద్యోగాలు
ఈడబ్ల్యూఎస్: 100 ఉద్యోగాలు
జనరల్: 405 ఉద్యోగాలు
జూనియర్ మేనేజ్ మెంట్ గ్రేడ్/ స్కేల్-1 కు సంబంధించిన ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత (ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ 55 శాతం) ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 20. దరఖాస్తుకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. అర్హత ఉన్న
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీకి మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీకి ఐదేళ్ల, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్ లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగ అభ్యర్థులు రూ.175 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం: ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవెర్నేస్ (రిలేటెడ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ) సబ్జెక్టుల నుంచి 30 ప్రశ్నలకు గానూ నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కుల చొప్పున ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎస్సై పరీక్ష రెండు ప్రశ్నలకు గానూ 30 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.. పరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.centralbankofindia.co.in
ALSO READ: NTPC Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే ఎనఫ్..
ముఖ్యమైనవి:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1000
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి(ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.)