BigTV English

Forest Beat Officer: 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా..? ఇంకా 4 రోజులే!

Forest Beat Officer: 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా..? ఇంకా 4 రోజులే!

FBO Notification: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది భారీ గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 691 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారికి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఇంటర్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారిక భారీ వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.


ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), 691 ఖాళీలతో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ అండ్‌ అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ నోటిఫికేషన్ (06/2025) రిలీజ్ చేసింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO)కి 256, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO)కి 435 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు 2025 జులై 16 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

మొత్తం వెకెన్సీల సంఖ్య: 691


ఇందులో రెండు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఎఫ్‌బీఓ), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు:

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: 256 పోస్టులు

అసిస్టెంట్ బీట్ ఆఫీసర్: 435 పోస్టులు

విద్యార్హత: ఇంటర్ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు…

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జులై 16

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్టు 5

శారీరక ప్రమాణాలు: పురుష అభ్యర్థులకు కనీసం 163 సెం.మీ ఎత్తు, మహిళలకు కనీసం 150 సెం.మీ ఎత్తు ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. NCC సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు బోనస్ మార్కులు వర్తింపజేస్తారు.

వయస్సు: 2025 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌కు రూ.25,220- రూ.80,910 జీతం ఉంటుంది. అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌కు రూ.23,120- రూ.74,770 జీతం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ఆబ్జెక్టివ్ ఓఎంఆర్‌ బేస్డ్‌), మెయిన్స్‌ ఎగ్జామినేషన్‌, వాకింగ్ టెస్ట్ / మెడికల్‌ టెస్ట్, కంప్యూటర్‌ ప్రొఫిషియేన్సీ టెస్ట్‌ తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ప్రాసెసింగ్ ఫీజు రూ.250 ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు రూ.80 ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు రూ.250 ఉంటుంది.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్‌సైట్ psc.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఓబీపీఆర్‌ (One Time Profile Registration) చేయాలి.

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగం వస్తే బంగారు భవిష్యత్తు మీ సొంతం అవుతోంది. ఇలాంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

మొత్తం వెకెన్సీల సంఖ్య: 691

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్ట్ 5

ALSO READ: Indian Railway: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ పోస్టులు, విద్యార్హతల్లో మెరిట్ ఉంటే చాలు..!

ALSO READ: Jobs in CCRAS: టెన్త్, ఇంటర్ పాసైతే ఉద్యోగం మీదే బ్రో.. జీతమైతే అక్షరాల రూ.39,100

Related News

Police Constable: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రూ.81వేల జీతం.. ఇంకా 5 రోజులు మాత్రమే సమయం

Hyderabad ECIL: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.. మంచి వేతనం

APSRTC Notification: ఏపీఎస్ఆర్టీసీలో 281 ఉద్యోగాలు.. మంచి వేతనం.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు

DDA Notification: డీడీఏలో 1732 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెంబర్ వన్ జాబ్ భయ్యా.. చివరి తేది ఇదే

DSSSB Jobs: ఇంటర్ అర్హతతో 1180 జాబ్స్.. ఈ జాబ్ వస్తే భారీ సంపాదన.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఇదే

UPSC Jobs: యూపీఎస్సీలో 213 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. డిగ్రీ పాసైతే చాలు.. పూర్తి వివరాలివే

TGPSC Group-1: గ్రూప్-1 వివాదం.. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించిన TGPSC

TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

Big Stories

×