Eastern Railway: రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈస్టర్న్ రైల్వే కోల్ కతాలో భారీగా అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక ప్రక్రియ, జీతం, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం, తదితర వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈస్టర్న్ రైల్వే కోల్‌కతా(Eastern Railway) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 3115 అప్రెంటిస్ ఖాళీలను భర్తీచేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. సెప్టెంబర్ 13న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 3115
ఈస్టర్న్ రైల్వే కోల్‌కతాలో వివిధ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఫిట్టర్, వెల్డర్, మెకానికల్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్‌మెన్, వైర్‌మెన్, ఆర్‌ఈఎఫ్&ఏసీ మెకానిక్, ఎలక్ట్రీషియన్ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు
1. హౌరా డివిజన్: 659
2. లిలువా వర్క్‌షాప్: 612
3. సీల్డా డివిజన్: 440
4. కాంచ్రపార వర్క్‌షాప్: 187
5. మాల్డా డివిజన్: 138
6. అసన్‌సోల్ డివిజన్: 412
7. జమలాపూన్ వర్క్‌షాప్: 667
విద్యార్హత: ఉద్యోగాలను బట్టి సంబంధిత విభాగంలో టెన్త్, ఇంటర్, ఐటీఐ పాసై ఉండాలి.
వయస్సు: 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్ట్ 14
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 13
దరఖాస్తుకు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.
ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా..
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://rrcer.org/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 3115
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 13
ALSO READ: Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. జస్ట్ ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా.. అర్హత ఇదే
ALSO READ: University of Hyderabad: గ్రేట్.. రూ.46లక్షల జీతంతో ఉద్యోగం.. ఇంకా 550 మందికి జాబ్స్..