BigTV English

OTT Movie : కామెడీ నుంచి యాక్షన్ వరకు ఓటీటీలో సినిమాల జాతర… అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్

OTT Movie : కామెడీ నుంచి యాక్షన్ వరకు ఓటీటీలో సినిమాల జాతర… అన్నీ తెలుగులోనే స్ట్రీమింగ్

OTT Movie : 2025 ఆగస్టు మొదటి వారం తెలుగు సినిమా ప్రేమికులకు ఒక పండగ వాతావరణం అనే చెప్పుకోవాలి. యాక్షన్, కామెడీ, హారర్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో నిండిన ఆరు ఆసక్తికరమైన తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారం ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్‌ఎన్‌ఎక్స్‌టీ, ఈటీవీ విన్ వంటి ప్లాట్‌ ఫామ్‌లలో ‘తమ్ముడు’, ‘3BHK’, ‘ఓ భామ అయ్యో రామ’, ‘జిన్: ది పెట్’, ‘రెడ్ సాండల్ వుడ్’, ‘థాంక్యూ నాన్న’ విడుదల కానున్నాయి. ఈ విభిన్న జానర్‌ల సినిమాలు ప్రేక్షకులకు వినోదంతో పాటు మరచిపోలేని థ్రిల్ ను కూడా అందించనున్నాయి. ఈ సినిమాల గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


1. తమ్ముడు (Thammudu)

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామా సినిమా నెట్‌ ఫ్లిక్స్ లో 2025 ఆగస్టు 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఇందులో నితిన్, స్వాసిక విజయ్, లయ, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో అక్కా తమ్ముడి మధ్య బంధాన్ని చక్కగా చూపించారు. జై (నితిన్) తన సోదరి కిరణ్మయి (లయ)ప్రమాదంలో పడినప్పుడు ఆమెను కాపాడేందుకు ఒక ప్రమాదకరమైన రిస్క్ ను తీసుకుంటాడు. విశాఖపట్నంలో జరిగిన ఒక ఫ్యాక్టరీ పేలుడు అనేక ప్రాణాలను బలిగొన్నప్పుడు, దాని యజమాని (సౌరభ్ సచ్‌దేవ) దానిని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తాడు. కిరణ్మయి ఈ కేసును హ్యాండిల్ చేస్తూ ప్రమాదంలో పడుతుంది. జై తన సోదరిని రక్షించడానికి న్యాయం కోసం పోరాడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. ఈ చిత్రం థియేటర్లలో అంతగా విజయం సాధించనప్పటికి, యాక్షన్ సన్నివేశాలు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో నెట్‌ఫ్లిక్స్‌లో ఈరోజునుంచి అందుబాటులోకి వచ్చింది.


2. 3BHK

శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ డ్రామా సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2025 ఆగస్టు 1నుంచి స్ట్రీమింగ్ కు వచ్చింది.
ఇందులో సిద్ధార్థ్, ఆర్. శరత్‌కుమార్, దేవయాని, మీథా రఘునాథ్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ చిత్రం చెన్నైలోని ఒక మధ్యతరగతి కుటుంబం ఇల్లు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలతో తిరుగుతుంది. వాసుదేవన్ (శరత్‌కుమార్), అతని భార్య శాంతి (దేవయాని), వారి పిల్లలు ప్రభు (సిద్ధార్థ్) తమ కలలను త్యాగం చేస్తూ, ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఇల్లు కొనేందుకు ప్రయత్నిస్తారు. ఈ కథ మధ్యతరగతి మనుషుల రోజువారీ జీవితాలను, త్యాగాలను వాస్తవికంగా చూపిస్తుంది. ఈ సినిమా తెలుగులో కూడా ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది.

3. ఓ భామ అయ్యో రామ (Oh Bhama Ayyo Rama)

రామ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ సినిమా 2025 ఆగస్టు 2 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇందులో సుహాస్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో సుహాస్ ఒక సరదాగా ఉండే ఒక యువకుడిగా నటిస్తాడు. అతను కీర్తి సురేష్ తో ప్రేమలో పడతాడు. వారి సంబంధం ఊహించని ట్విస్ట్‌లు, కుటుంబ డ్రామాతో నడుస్తుంది. ఈ చిత్రం వినోదంతో పాటు ఆకట్టుకునే ఎమోషన్స్ క్షణాలను కూడా అందిస్తుంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌కు పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఈటీవీ విన్‌లో ఈ చిత్రం రేపటినుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సుహాస్, కీర్తి సురేష్‌ల కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది.

4. జిన్: ది పెట్ (Jinn: The Pet)

టీఆర్ బాల దర్శకత్వం వహించిన ఈ హారర్ కామెడీ సినిమా 2025 ఆగస్టు 1 నుంచి సన్‌ ఎన్‌ఎక్స్‌టీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో
ముగెన్ రావు, భవ్య త్రిఖా, బాల సరవణన్, వడివుక్కరసి, ఇమాన్ అణ్ణాచి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ ఒక పిల్లవాడు, ఒక అతీంద్రియ జీవి మధ్య జరిగే సంఘటనలను చూపిస్తుంది. ఒక కుటుంబం తమ ఇంట్లో ఒక “పెట్”గా జిన్‌ను తీసుకొస్తారు. అప్పటినుంచి వారి జీవితాలలో ఊహించని గందరగోళం ఏర్పడుతుంది. ఈ చిత్రం మే 2025లో థియేటర్లలో విడుదలై, ఇప్పుడు సన్‌ఎన్‌ఎక్స్‌టీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఒక చిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.

5. రెడ్ సాండల్ వుడ్ (Red Sandal Wood)

గురు రామానుజం దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 2025 జులై 31 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇందులో వెట్రి, దియా మయూరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ 2015లో జరిగిన నిజమైన ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు ఆధారంగా రూపొందింది. ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేర ప్రపంచాన్ని, దానితో సంబంధం ఉన్న రాజకీయ లొసుగులను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ చిత్రం ఒక గ్రిప్పింగ్ కథాంశంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. 2023 సెప్టెంబర్ లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, రెండు సంవత్సరాల తరువాత ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

6. థాంక్యూ నాన్న (Thankyou Nanna)

శ్రీనివాస్ రావు దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ 2025 ఆగస్టు 3 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నాగశౌర్య, శిరీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ స్టోరీ ఒక తండ్రి-కొడుకు మధ్య బంధాన్ని హైలైట్ చేస్తుంది. నాగశౌర్య ఒక యువకుడిగా, తన తండ్రి (శిరీష్)తో కలిసి జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కొంటాడు. ఈ కథ ప్రేమ, త్యాగం, కుటుంబ విలువల చుట్టూ తిరుగుతుంది. ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ చిత్రం, ఫ్యామిలీ డ్రామాలు ఇష్టపడే వారికి ఒక ఆహ్లాదకర అనుభవాన్ని అందిస్తుంది.

Read Also : పెళ్లి చూపుల్లో అవమానం… నెక్స్ట్ ట్విస్టుకు కాటేరమ్మ జాతర… హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు చూడకూడని హర్రర్ మూవీ

Related News

OTT Movie : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా

OTT Movie : రాత్రికి రాత్రే వింత చావులు… అర్ధరాత్రి పీకలు తెగ్గోసే కిల్లర్… గూస్ బంప్స్ పక్కా

OTT Movie : బాబోయ్ దెయ్యంపైనే ప్రయోగం… కట్ చేస్తే గూస్ బంప్స్ ట్విస్ట్…. ముచ్చెమటలు పట్టించే హర్రర్ మూవీ

OTT Movie : అనామకుల చెరలో ఇద్దరమ్మాయిలు… కిల్లర్స్ అని తెలియక కలుపుగోలుగా ఉంటే… బ్లడీ బ్లడ్ బాత్

OTT Movie : ప్రెగ్నెంట్ వైఫ్ ఫోటో మార్ఫింగ్… ఒక్క రాత్రిలో ఫుడ్ డెలివరీ బాయ్ లైఫ్ అతలాకుతలం… సీను సీనుకో ట్విస్ట్

Mohanlal: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న మోహన్ లాల్ బ్లాక్ బాస్టర్ మూవీ!

Little Hearts OTT: దసరాకు ఓటీటీలోకి ‘లిటిల్‌ హార్ట్స్‌’.. వారికి మేకర్స్‌ స్వీట్‌ వార్నింగ్, ఏమన్నారంటే!

OTT Movie : పెళ్లి చెల్లితో, ఫస్ట్ నైట్ అక్కతో… కట్ చేస్తే బుర్రబద్దలయ్యే ట్విస్టు … ఇదెక్కడి తేడా యవ్వారంరా అయ్యా

Big Stories

×