Sukumar daughter: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విశిష్టమైన దర్శకులలో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమా విడుదలైనప్పుడు రాజమౌళి ఇలాంటి దర్శకుడు చూసి ఆశ్చర్యపోయాడు. ఆర్య సినిమా చూస్తున్నప్పుడు నాకు పోటీగా అసలైన దర్శకుడు వచ్చాడు. మనం పోటీ పడలేం. కానీ ఫ్రెండ్షిప్ చేసుకోవడం బెటర్ అంటూ సుకుమార్ తో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెట్టాడట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తెలిపారు.
తెలుగు సినిమాలలో సుకుమార్ సినిమాలు వేరేలా ఉంటాయని చెప్పాలి. సుకుమార్ ఆలోచన చాలా కొత్తగా ఉంటుంది. ఆర్య సినిమా నుంచి మొన్న వచ్చిన పుష్ప సినిమా వరకు సినిమా మధ్యలో ఫెయిల్ అయిన కూడా సుకుమార్ ఏ రోజు దర్శకుడుగా ఫెయిల్ కాలేదు. సుకుమార్ సినిమా అప్పుడు అర్థం కాకపోవచ్చు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎటువంటి సినిమాను అర్థం చేసుకోలేకపోయాము అనే బాధ ఆడియన్స్ కి కలుగుతుంది.
లెక్కలు తేల్చిన లెక్కలు మాస్టర్ కూతురు
సుకుమార్ కి సుకృతి అన్న కూతురు ఉన్న విషయం తెలిసిందే. సుకృతి చాలా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా సుకృతి లో కూడా విపరీతమైన టాలెంట్ ఉంది. సుకృతి కీలకపాత్రలో నటించిన సినిమా గాంధీ తాత చెట్టు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా కూడా, డీసెంట్ సినిమా అంటూ మంచి ప్రశంసలు వచ్చాయి. ఇక ఈ సినిమాకి గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సుకృతికి నేషనల్ అవార్డు వచ్చింది. మొత్తానికి లెక్కలు మాస్టర్ సుకుమార్ కూతురు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ అందుకోకపోయినా ప్రశంసల్ని అందుకోవడం అనేది తండ్రిగా సుకుమార్ కి గర్వించదగ్గ విషయం అని చెప్పాలి.
సుకుమార్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్
రీసెంట్ గా సుకుమార్ పుష్ప 2 సినిమాతో అద్భుతమైన సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా కమర్షియల్ గా విపరీతమైన సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం పెద్ది సినిమా అయిపోయిన తర్వాత రామ్ చరణ్ హీరోగా సుకుమార్ సినిమా చేయాల్సి ఉంది. ఈ కాంబినేషన్ మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం ఇదివరకే వచ్చిన రంగస్థలం సినిమా. రామ్ చరణ్ లోని ఒక పరిపూర్ణమైన నటుడిని బయటికి తీసిన ఘనత సుకుమార్ కు దక్కుతుంది. చరణ్ ఎన్ని సినిమాలు చేసిన రంగస్థలం సినిమాకి ఉన్న స్థాయి వేరు స్థానం వేరు.
Also Read: Anil Ravipudi: ఎంటర్టైన్మెంట్ కాకుండా సోషల్ ఎలిమెంట్ తో సినిమా చేశా అందుకే ఈ గుర్తింపు