E-Paper
Advertisement

HPCL Recruitment: HPCL‌లో భారీగా ఆఫీసర్ ఉద్యోగాలు.. గోల్డెన్ లైఫ్ భయ్యా, ఇంకెందుకు ఆలస్యం

HPCL Recruitment: HPCL‌లో భారీగా ఆఫీసర్ ఉద్యోగాలు.. గోల్డెన్ లైఫ్ భయ్యా, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

మహారత్న హోదా కలిగిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) నిరుద్యోగులకు భారీ అవకాశాన్ని కల్పించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 732 ఆఫీసర్ స్థాయి పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా అటు తాజాగా చదువు పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు ఇటు ఇప్పటికే అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు.

పోస్టుల వివరాలు.. 

Advertisement

మొత్తం 732 పోస్టులలో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌, ఇంజినీర్‌, ఆఫీసర్ కేటగిరీలు ఉన్నాయి.

మొత్తం పోస్టుల సంఖ్య: 732

Advertisement

వివిధ విభాగాల్లో వెకెన్సీ వివరాలు.. 

వీటిలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో 72 ఖాళీలు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 37, సివిల్ ఇంజనీరింగ్‌లో 17, కెమికల్ ఇంజనీరింగ్‌లో 15 పోస్టులు ఉన్నాయి. ఇవి కాకుండా ఫైనాన్స్, హెచ్‌ఆర్, క్వాలిటీ కంట్రోల్, ఫైర్ అండ్ సేఫ్టీ, లా, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వంటి విభాగాల్లో కూడా పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. సీబీజీ ఆపరేషన్స్, సేల్స్ వంటి కీలక రంగాల్లో సీనియర్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ స్థాయి ఉద్యోగాలకు ఎక్స్ పీరియన్స్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హతలు:

పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బీఈ, బీటెక్‌, ఎంబీఏ, సీఏ, సీఎంఏ, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు అవుతారు.

వయస్సు:

వయోపరిమితి విషయానికొస్తే 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

జీతం:

ఎంపికైన వారికి పోస్టు స్థాయిని బట్టి నెలకు రూ. 30,000 నుంచి గరిష్ఠంగా రూ. 2,80,000 వరకు భారీ వేతనం లభించే అవకాశం ఉంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: 

అభ్యర్థుల ప్రతిభను పరీక్షించేందుకు బహుళ దశల ఎంపిక ప్రక్రియను రూపొందించారు. ముందుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన వారికి గ్రూప్ టాస్క్, సైకోమెట్రిక్ అసెస్‌మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి. రాత పరీక్షను మే 3, 2026న నిర్వహించాలని సంస్థ భావిస్తోంది.

దరఖాస్తు విధానం:  

అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు హెచ్‌పీసీఎల్‌ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు: 

ఫిబ్రవరి 25 మధ్యాహ్నం 1:00 గంట నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 25 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చారు.

దరఖాస్తు ఫీజు: 

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1180 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.hindustanpetroleum.com/

ALSO READ: HPCL Recruitment 2026: HPCL‌లో భారీగా అప్రెంటీస్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే అప్లై చేసుకోండి, పూర్తి వివరాలివే..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×