E-Paper
Advertisement

HPCL Recruitment 2026: HPCL‌లో భారీగా అప్రెంటీస్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే అప్లై చేసుకోండి, పూర్తి వివరాలివే..

HPCL Recruitment 2026: HPCL‌లో భారీగా అప్రెంటీస్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే అప్లై చేసుకోండి, పూర్తి వివరాలివే..
Advertisement

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) నిరుద్యోగ యువతకు అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఈ సంస్థ 2026-27 సంవత్సరానికి గానూ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీల ఎంపిక కోసం దరఖాస్తులు కోరుతోంది.

వెకెన్సీ వివరాలు.. 

Advertisement

మొత్తం 250 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిలో విశాఖపట్నం రిఫైనరీలో 130 పోస్టులు కేటాయించగా ముంబయి రిఫైనరీలో 120 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసి కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి వేదికగా నిలవనుంది.

విద్యార్హతలు: 

Advertisement

అర్హతల విషయానికి వస్తే అభ్యర్థులు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి కీలక విభాగాల్లో ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ తో పాటు కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

శిక్షణ కాలం: సెలెక్ట్ అయిన వారికి ఈ శిక్షణ కాలం ఏడాది పాటు ఉంటుంది.

స్టైఫండ్: ఎంపికైన వారికి నెలకు రూ. 25,000 స్టైపెండ్ అందిస్తారు.

వయస్సు:  2026 మార్చి 10వ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు అలాగే ఓబీసీలకు మూడేళ్లు మినహాయింపు కల్పించారు. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు సడలింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న వారిని అకడమిక్ మెరిట్ ఇంకా ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలు అవుతాయి.

దరఖాస్తు విధానం: 

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా అప్రెంటిస్‌షిప్ శిక్షణ బోర్డు (BOAT) కింద ఉన్న ఎన్‌ఏటీఎస్‌ (NATS 2.0) పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత హెచ్‌పీసీఎల్‌ అధికారిక అప్రెంటిస్ పోర్టల్‌లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

దరఖాస్తుకు చివరి తేది:  మార్చి 10వ తేదీని దరఖాస్తులకు చివరి గడువుగా నిర్ణయించారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థలో అనుభవం సంపాదించాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.hindustanpetroleum.com/

ALSO READ: Mahanadi Coalfields: మైనింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.51వేల జీతం, విద్యార్హతలు ఇవే..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×