E-Paper
Advertisement

Indian Air Force Recruitment 2025: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు జాబ్ గ్యారంటీ !

Indian Air Force Recruitment 2025: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు జాబ్ గ్యారంటీ !

Indian Air Force Recruitment 2025: భారత వైమానిక దళం (Indian Air Force – IAF) దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక ప్రతిష్టాత్మక సంస్థ. IAF 2025 సంవత్సరానికి .. గ్రూప్ C పోస్టుల కోసం 153 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 01/2025 ప్రకారం.. లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), హిందీ టైపిస్ట్, డ్రైవర్, కార్పెంటర్, కుక్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS), హౌస్ కీపింగ్ స్టాఫ్ వంటి వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ యువతకు భారత వైమానిక దళంలో సివిలియన్ ఉద్యోగాల్లో చేరే అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, జీతంతో పాటు పూర్తి వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నోటిఫికేషన్ వివరాలు:

భారత వైమానిక దళం గ్రూప్ C రిక్రూట్మెంట్ కోసం. మే 17, 2025 నుండి జూన్ 15, 2025 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ http://indianairforce.nic.in/ నుండి నోటిఫికేషన్ PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను నింపి, సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్/యూనిట్ చిరునామాకు పంపించాలి.

అర్హతలు:
గ్రూప్ C పోస్టులకు అర్హతలు పోస్టును బట్టి మారుతాయి. సాధారణంగా.. అభ్యర్థులు కనీసం 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), హిందీ టైపిస్ట్: 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్‌లో 35 పదాలు/నిమిషం లేదా హిందీలో 30 పదాలు/నిమిషం టైపింగ్ స్పీడ్ అవసరం.

డ్రైవర్: 10వ తరగతి ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం.

కుక్ , కార్పెంటర్: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికేట్ లేదా డిప్లొమా కలిగి ఉండాలి.

మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS): 10వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది. వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST/OBC/PWD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు తప్పకుండా భారతీయ పౌరులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:
గ్రూప్ C రిక్రూట్మెంట్ ఎంపిక ప్రక్రియలో రెండు దశలు ఉంటాయి.

రాత పరీక్ష: ఈ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, , జనరల్ ఇంగ్లీష్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది.

స్కిల్/ప్రాక్టికల్/ఫిజికల్ టెస్ట్: పోస్టును బట్టి.. అభ్యర్థులు టైపింగ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, లేదా ఇతర స్కిల్ టెస్ట్‌లను ఉంటాయి. ఈ దశలోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహిస్తారు.

జీతం, ఇతర ప్రయోజనాలు:

గ్రూప్ C పోస్టులకు జీత భత్యాలు 7వ CPC పే మ్యాట్రిక్స్ ప్రకారం ఉంటాయి. లెవెల్ 1 పోస్టులకు నెలకు ₹18,000, లెవెల్ 2 పోస్టులకు ₹19,900 జీతం ఉంటుంది. ఇందులో డియర్‌నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ వంటి అదనపు ప్రయోజనాలు ఉంటాయి.

Also Read: డీగ్రీ, బీటెక్ పాసైతే చాలు.. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.. జీతం రూ.2,50,000

 గ్రూప్ C  ఉద్యోగాలు ఎందుకు ?
భారత వైమానిక దళంలో గ్రూప్ C సివిలియన్ ఉద్యోగాలు నాన్-కంబాట్ రోల్స్‌లో దేశ సేవ చేయడానికి అవకాశం కల్పిస్తాయి. ఈ ఉద్యోగాలు మీకు స్థిరమైన ఆదాయం, ఉద్యోగ భద్రత, గౌరవప్రదమైన కెరీర్‌ను అందిస్తాయి.

IAF గ్రూప్ C రిక్రూట్మెంట్ 2025 అనేది భారతీయ యువతకు ఒక అద్భుతమైన అవకాశం. అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదివి, అర్హతలను బట్టి, లాస్ట్ డేట్‌కు ముందే దరఖాస్తు చేసుకోండి.

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×