E-Paper
Advertisement

CM Revanth Reddy : మీ రేవంతన్నగా మాట ఇస్తున్నా.. వడ్డీతో సహా..

CM Revanth Reddy : మీ రేవంతన్నగా మాట ఇస్తున్నా.. వడ్డీతో సహా..
Advertisement

CM Revanth Reddy : ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దేశంలో 16 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు అప్పు ఇస్తే చాలామంది అప్పు ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లారని.. కానీ, మన ఆడబిడ్డలకు అప్పు ఇస్తే.. ఒక్క రూపాయి ఎగ్గొట్టకుండా వడ్డీతో సహా చెల్లిస్తున్నారని ప్రశంసించారు. ఆర్ధిక క్రమశిక్షణ మన ఆడబిడ్డల సొంతమన్నారు. మీ రేవంతన్నగా మీకు ప్రోత్సాహం అందిస్తానని మహిళలకు హామీ ఇచ్చారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో జరిగిన WE Hub విమెన్​ యాక్సిలరేషన్ ప్రోగ్రాంకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.

కోటి మంది మహిళలు..

Advertisement

ఇప్పటికే వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని మహిళలకు అప్పగించామని.. సమర్ధవంతంగా నిర్వహిస్తే మరో వెయ్యి మెగావాట్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు సీఎం రేవంత్. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తి చేసిన వాటినే రాష్ట్రానికి వచ్చే అతిథులకు బహుమతులుగా ఇస్తున్నామని అన్నారు. నగరాల్లోనూ సంఘ సభ్యుల సంఖ్య పెంచాల్సి ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్యను కోటికి పెంచాలని పిలుపు ఇచ్చారు సీఎం.

Also Read : తెలంగాణ కేబినెట్ విస్తరణ రేసులో కొత్త పేర్లు..

Advertisement

ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని.. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో ఆడబిడ్డలకు అప్పగించామన్నారు. విద్యార్థుల యునిఫార్మ్ కుట్టు పనిని మహిళా సంఘాలకు అప్పగించి వారికి భరోసా కల్పించామని చెప్పారు. వ్యాపారంలో మహిళలను ప్రోత్సహిస్తున్నామని.. పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాలను మహిళా సంఘాలకు ఇస్తున్నామని తెలిపారు. అదానీ, అంబానీలకు పరిమితమైన వ్యాపారాలను మహిళలు చేసేలా ప్రోత్సహిస్తున్నామని.. శిల్పారామంలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల ప్రదర్శనకు స్టాల్స్ ను కేటాయించామని గుర్తు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

Related News

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

ఇన్‌స్టాగ్రామ్ లవ్ డ్రామా.. 14 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

Big Stories

Advertisement
×