E-Paper
Advertisement

Army Jobs 2024: ఆర్మీలో భారీ వేతనంతో ఉద్యోగం.. అయితే ఒక కండీషన్..!

Army Jobs 2024: ఆర్మీలో భారీ వేతనంతో ఉద్యోగం.. అయితే ఒక కండీషన్..!
Advertisement

Indian Army TES 52 Notification 2024: ఇండియన్ ఆర్మీలో జనవరి 2025లో ప్రారంభమయ్యే 52వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది. దీని ద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2 లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ 2024 లో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అవివాహిత పురుషులు మాత్రమే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 13 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉంది.

Advertisement

అర్హత: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి 60 శాతం మార్కులతో 10+2 లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులు అయి ఉండాలి. అంతే కాకుండా 2024 జేఈఈ మెయిన్స్ లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి: 16 ఏళ్ల 6 నెలల నుంచి 19 ఏళ్ల 6 నెలల మధ్య వయస్సు ఉండాలి.

Advertisement

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
ఎంపిక విధానం: స్టేజ్ 1, స్టేజ్ 2, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేదీ: 13.06.2024

Also Read: ఖాళీల భర్తీకి యూపీఎస్సీ సీడీఎస్‌ఈ (2)- 2024 నోటిఫికేషన్ విడుదల.. తొందరగా అప్లై చేసేయండి

వేతనం: మూడేళ్ల శిక్షణ అనంతరం అభ్యర్థులకు నెలకు రూ. 56,100 చొప్పున స్టైఫండ్ ఇస్తారు. నాలుగేళ్ల శిక్షణ తరువాత పూర్తి వేతనం చెల్లిస్తారు. కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత లెఫ్టినెంట్ హోదాలో విధుల్లోకి తీసుకుంటారు.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×