BigTV English

Hemant Soren: ‘ఈయనకొక్కనికి బెయిలిస్తే.. అందరు అడుగుతారు’

Hemant Soren:  ‘ఈయనకొక్కనికి బెయిలిస్తే.. అందరు అడుగుతారు’

Hemant Soren Hearing Updates: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు మరోసారి ఎదురుదెబ్బ తలిగింది. లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వీలు కల్పిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్ ఈడీ సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. తనపై దాఖలైన నగదు అక్రమ చలామణి కేసులో దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ఆయన చెడగొట్టేందుకు ప్రయత్నించే అవకాశముందని ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది.


ఈ మేరకు హేమంత్ మధ్యంతర బెయిల్ పిటిషన్ విషయమై ప్రమాణపత్రం దాఖలు చేసింది. సాధారణ పౌరుడికి మించి ఏ రాజకీయ నాయకుడు ప్రత్యేక హోదాను ఆశించలేరని ఈడీ పేర్కొంది. అదేవిధంగా ఎన్నికల్లో ప్రచారం కోసమంటూ సోరెన్ కు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తే తమను కూడా అలాగే ప్రత్యేక తరగతి గా పరిగణిస్తూ జైలులో ఉన్న మిగతా రాజకీయ నాయకులందరూ కూడా బెయిల్ కోరే ప్రమాదం లేకపోలేదని ఈడీ తెలిపింది.

దేశంలో ఏడాది పొడవునా ఏదో ఒకరకమైన ఎన్నికలు జరుగుతాయని, ఒకవేళ హేమంత్ సోరెన్ అభ్యర్థనను అంగీకరించి ఆయనకు బెయిల్ ఇస్తే.. ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కూడా అరెస్ట్ చేయలేమని, జ్యుడీషియల్ కస్టడీలో ఉంచలేమని ఈడీ స్పష్టం చేసింది. హేమంత్ అరెస్ట్ ను హైకోర్టు సమర్థించిందని, హేమంత్ సోరెన్ సాధారణ బెయిల్ పిటిషన్ ను విచారణ న్యాయస్థానం మే 13న కొట్టివేసిందని గుర్తుచేస్తూ పేర్కొన్నది. అయితే, భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు విషయమై జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ను ఈడీ జనవరి 31న అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి హోమంత్ సోరెన్ జైలులోనే ఉన్న విషయం తెలిసిందే.


Related News

Modi New Strategy: అమెరికాను దెబ్బ కొట్టేందుకు మోదీ స్వదేశీ మంత్రం.. ఫలిస్తుందా?

Tariff Affect: ట్రంప్ సుంకాల మోత అమలులోకొచ్చింది.. ఎక్కువ ప్రభావం వీటిపైనే

Bihar: బీహార్ యాత్రలో సీఎం రేవంత్.. రాహుల్ గాంధీ ప్లాన్ అదేనా!

Jammu Kashmir: ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి..

Trump-Modi: 4సార్లు ట్రంప్ ఫోన్ కాల్ కట్ చేసిన మోదీ.. జర్మనీ పత్రిక సంచలన కథనం

Cloudburst: దోడాలో క్లౌడ్ బరస్ట్.. జమ్మూ ప్రాంతంలో వరదల విజృంభణ.. మళ్లీ ప్రాణనష్టం!

Big Stories

×