E-Paper
Advertisement

ఇండియన్ బ్యాంక్‌లో 350 ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, ఇంకెందుకు ఆలస్యం!

ఇండియన్ బ్యాంక్‌లో 350 ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, ఇంకెందుకు ఆలస్యం!
Advertisement

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొలువు సాధించాలనుకునే అభ్యర్థులకు ఇండియన్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. చెన్నై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ బ్యాంక్ 2026 సంవత్సరానికి గాను స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) కేడర్‌లో వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మొత్తం 350 పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. డేటా అనలిస్ట్ నుంచి క్రెడిట్ మేనేజ్‌మెంట్ వరకు రకరకాల నైపుణ్యాలు గల అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు.

Advertisement

విభాగాల వారీగా వెకెన్సీ వివరాలు: 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో మేనేజర్ స్థాయి ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా డేటా అనలిస్ట్, నెట్‌వర్క్ ఆపరేషన్స్, అప్లికేషన్ డెవలపర్ వంటి సాంకేతిక పోస్టులతో పాటు క్రెడిట్, ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. సీనియర్ మేనేజర్ కేటగిరీలో రిస్క్ మేనేజ్‌మెంట్, ఐటీ రిస్క్, ఫారెక్స్ డీలర్ పోస్టులు ఉండగా అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో సెక్యూరిటీ, సివిల్ ఇంజనీరింగ్ పోస్టులను కేటాయించారు.

Advertisement

విద్యార్హతలు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి నిర్ణీత విద్యార్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ లేదా ఎంబీఏ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. కొన్ని కీలక పోస్టులకు చార్టర్డ్ అకౌంటెంట్ (CA) అర్హతతో పాటు నిర్దేశిత పని అనుభవం తప్పనిసరి చేశారు.

వయస్సు: వయోపరిమితి విషయానికి వస్తే పోస్టును అనుసరించి కనీసం 22 నుంచి 30 ఏళ్లు ఉండాలి. గరిష్ఠ వయస్సు 31 నుండి 45 ఏళ్ల మధ్య ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు స్కేల్-1, స్కేల్-2, స్కేల్-3 హోదాలను బట్టి భారీ వేతన ప్యాకేజీలు అందుతాయి. జీతంతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, మెడికల్ ఎయిడ్ వంటి ఇతర ప్రయోజనాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లభిస్తాయి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియ ప్రధానంగా రెండు పద్ధతుల్లో ఉండే అవకాశం ఉంది. దరఖాస్తుల సంఖ్యను బట్టి షార్ట్‌లిస్టింగ్ చేసిన తర్వాత నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించడం లేదా ఆన్‌లైన్ రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ప్రతిభను అంచనా వేసి తుది ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీల వివరాలు: 

అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల నమోదు ప్రక్రియ 2026 ఏప్రిల్ 8 నుంచి ప్రారంభం కానుంది. ఫీజు చెల్లించడానికి దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 28, 2026 ఆఖరి తేదీగా నిర్ణయించారు.

దరఖాస్తు ఫీజు: వస్తే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.175 చెల్లించాలి. సాధారణ కేటగిరీ సహా ఇతరులందరికీ రూ.1000 ఫీజుగా నిర్ణయించారు.

అర్హత గల అభ్యర్థులు గడువులోగా ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://indianbank.bank.in/

ALSO READ: టెన్త్ క్లాస్ అర్హతతో 557 ఉద్యోగాలు.. నెలకు రూ.47,330 జీతం, దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఇదే

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×