E-Paper
Advertisement

Inter Students: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ దిగులు అవసరం లేదు

Inter Students: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం..  ఆ దిగులు అవసరం లేదు
Advertisement

Inter Students: ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఎప్పటికప్పుడు మార్పులకు శ్రీకారం చుడుతోంది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా పరిస్థితులకు అనుకూలంగా అడుగులు వేస్తోంది. ఇంటర్ విద్యార్థులంతా ఐఐటీ ఎంట్రన్స్ పరీక్షలు రాసేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ఇంటర్ విద్యార్థులకు మరొక శుభవార్త చెప్పేసింది. ఇంతకీ ఆ కబురేంటి?

ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

Advertisement

ఇంటర్‌ విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు తమ మార్కులు మెరుగు పరుచుకునేందుకు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్ష రాసే కల్పించాలని డిసైడ్ అయ్యింది. దీనిపై విద్య శాఖల మంత్రి లోకేష్.. అధికారులతో పలుమార్లు సమావేశయ్యారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది బోర్డు.

ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఫెయిల్ అయినా బాధపడాల్సిన పని లేదు. వాటిని మళ్లీ రాసుకునే అవకాశం కల్పించింది. అంతేకాదు చాలామందికి ఐఐటీ ఎంట్రన్స్ రాయాలని భావిస్తున్నారు. వారికి పర్సెంటేజ్ రాకపోవడంతో డ్రాపవుట్ అవుతున్నారు. దీనిపైనా కూడా ప్రభుత్వం ఫోకస్ చేసింది.

Advertisement

సెకండియర్‌లో విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకునే అవకాశం

పాసైనవారు సబ్జెక్టుల్లో ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటివరకు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆ తరహా వెసులుబాటు లేదు. కేవలం ఫస్టియర్ విద్యార్థులు అన్నిసబ్జెక్టులు ఉత్తీర్ణులైనవారికి ఈ అవకాశం ఉంది. దేశంలోని కర్ణాటక, హర్యానాతోపాటు పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేసింది ఇంటర్మీడియట్‌ బోర్డు.

ఈ నేపథ్యంలో పాసైన సబ్జెక్టుల్లో ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసుకోవచ్చు. ఫెయిలైన సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత కోసం పరీక్షలు రాసుకునే సదుపాయం కల్పించింది. ఈ అవకాశం ఒక్కసారి మాత్రమే. విద్యార్థులు మరొక విషయాన్ని గమనించాలి. ప్రాక్టికల్స్‌కు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు ఉండవు. కేవలం వృత్తి విద్యా కోర్సులకు ఇంప్రూవ్‌మెంట్‌ విధానం వర్తించనుంది.

ALSO READ: BPCL‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు బ్రో

ఇందుకు కారణాలు లేకపోలేదు. ఐఐటీల్లో జాయిన్ అయ్యే విద్యార్థులకు ఇంటర్‌లో 75 శాతం మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం మార్కులు ఉండాలనే నిబంధన ఉంది. చాలామంది విద్యార్థులకు ఇంటర్ పర్సెంట్ చాలక డ్రాపవుతున్నారు. ఇలాంటి విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్‌ ద్వారా మార్కులు పెంచుకునే అవకాశం కల్పించింది ప్రభుత్వం.

ఇక ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంది. మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులకు మరోసారి అవకాశం లభిస్తుంది. పరీక్ష, ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకునే విద్యార్థులు ఫీజులను ఈనెల 20 నుంచి 27 లోపు చెల్లించాల్సి ఉంటుందని ఓ ప్రకటన తెలిపింది.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×