నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 250 ఎంట్రీ లెవల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్, అకౌంట్స్, క్వాలిటీ అస్యూరెన్స్, అఫీషియల్ లాంగ్వేజ్ వంటి విభాగాల్లో ఈ నియామకాలు జరగనున్నాయి. కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు ప్రభుత్వ రంగ సంస్థలో ఇది మంచి అవకాశంగా నిలుస్తుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, వయస్సు, తదితర అంశాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం.
మొత్తం 250 పోస్టులలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ విభాగంలో అత్యధికంగా 175 ఖాళీలు ఉన్నాయి. అకౌంట్స్ విభాగంలో 25 పోస్టులు ఉండగా వేసైడ్ ఎమినిటీస్ విభాగంలో 10 ఖాళీలు భర్తీ చేయనున్నారు. సెక్రటరీ పోస్టులు 8 కేటాయించారు. అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ అస్యూరెన్స్ విభాగంలో 30 ఖాళీలు ఉన్నాయి. అఫీషియల్ లాంగ్వేజ్ విభాగంలో 2 పోస్టులు భర్తీ కానున్నాయి.
విద్యార్హత: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీటెక్ లేదా బీఈ పూర్తి చేసి ఉండాలి. అకౌంట్స్ పోస్టులకు సీఏ లేదా సీఎంఏ ఉత్తీర్ణులైన వారు అర్హులు. మిగిలిన పోస్టులకు ఎంఏ లేదా ఎంఎస్సీ అర్హత ఉండాలి. విద్యార్హతలతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరి.
వయస్సు: 2026 ఏప్రిల్ 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 నుంచి రూ.1,40,000 వరకు వేతనం అందుతుంది.
సెలక్షన్ ప్రాసెస్: ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదట కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని గ్రూప్ డిస్కషన్‌కు పిలుస్తారు. చివరగా వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి తుది జాబితా రూపొందిస్తారు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు: 2026 ఏప్రిల్ 18వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ 2026 మే 17గా నిర్ణయించారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అలాగే ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1180 ఫీజు చెల్లించాలి. ఎస్సీ అలాగే ఎస్టీ అలాగే పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
పూర్తి వివరాల కోసం అభ్యర్థులు బీపీసీఎల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.bharatpetroleum.in/
ALSO READ: భద్రాద్రి, బాసర పుణ్య క్షేత్రాలకు మహర్దశ.. రూ 811 కోట్లతో పునర్నిర్మాణానికి శ్రీకారం