E-Paper
Advertisement

ISRO: రూ.2లక్షల జీతంతో ఇస్రోలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు, జాబ్ వచ్చేస్తది..

ISRO: రూ.2లక్షల జీతంతో ఇస్రోలో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే చాలు, జాబ్ వచ్చేస్తది..
Advertisement

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)కు చెందిన ప్రతిష్ఠాత్మక ‘స్పేస్ అప్లికేషన్ సెంటర్’ (SAC), అహ్మదాబాద్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్, ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన ప్రతిభావంతులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అంతరిక్ష పరిశోధన రంగంలో కెరీర్‌ను ప్రారంభించాలనుకునే యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.

వెకెన్సీలు, విభాగాల వివరాలు. 

Advertisement

మొత్తం 49 సైంటిస్ట్‌/ఇంజినీర్‌ (ఎస్‌డీ/ఎస్‌సీ) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, ఇతర అనుబంధ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు అహ్మదాబాద్‌లోని యూనిట్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

విద్యార్హతలు వివరాలు ఇవే.. 

Advertisement

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంఎస్సీ/ బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కొన్ని పోస్టులకు నిర్ణీత పని అనుభవం తప్పనిసరి.

వయోపరిమితి విషయానికి వస్తే.. 2026 ఫిబ్రవరి 12 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు వయో సడలింపు లభిస్తుంది.

వేతనం, ఉద్యోగ ఎంపిక విధానం.. 

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 56,100 నుంచి రూ. 2,08,700 వరకు వేతనం లభిస్తుంది. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా అందుతాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ప్రతిభ కనబరిచిన వారికి స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం ఇలా.. 

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ. 750

దరఖాస్తు ప్రారంభం: 2026 జనవరి 23

చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 12

అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం, దరఖాస్తు కోసం ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. గడువు ముగిసేలోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

ALSO READ: UPSC: సువర్ణవకాశం.. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు లాస్ట్ డేట్..?

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×