E-Paper
Advertisement

JEE Advance-2026 Data Breach: జేఈఈ అడ్వాన్స్‌డ్-2026, డేటా లీక్ కాలేదన్న ఐఐటీ రూర్కీ

JEE Advance-2026 Data Breach: జేఈఈ అడ్వాన్స్‌డ్-2026,  డేటా లీక్ కాలేదన్న ఐఐటీ రూర్కీ
Advertisement

JEE Advance-2026 Data Breach: ఐఐటీల్లో ప్రవేశానికి జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 అభ్యర్థుల సమాచారం లీక్ అయిందంటూ ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చేసింది ఐఐటీ రూర్కీ. లక్షలాది మంది విద్యార్థుల డేటా చోరీకి గురైందనే వార్తలు కేవలం అసత్యాలు, తప్పుదోవ పట్టించేవి ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

జేఈఈ అడ్వాన్స్‌డ్-2026, డేటా లీక్ కాలేదన్న ఐఐటీ రూర్కీ

Advertisement

దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశానికి పరీక్ష రెండు అంచెలుగా ఉంటుంది.  తొలుత  మెయిన్స్  పరీక్షలు జరుగుతాయి.  అందులో పాసైన విద్యార్థులు అడ్వాన్స్‌డ్ రాస్తారు. అయితే అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను అధిగమించడానికి ఈ ఏడాది జూన్ 2న కొన్నిసాంకేతిక మార్పులు చేసినట్లు ఐఐటీ రూర్కీ తెలిపింది.

ఇందులో భాగంగా క్లౌడ్ స్టోరేజ్ కాంపోనెంట్‌లో తాత్కాలిక లోపం ఏర్పడిందని తెలిపింది. అదే సమయంలో దుబాయ్‌కి చెందిన సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు రాయ్‌లెన్ అనిల్ దీనిపై ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లోపం వల్ల అభ్యర్థుల డేటా ఆన్‌లైన్‌లో బహిర్గతమైందని ఆరోపించారు. దాదాపు 1.79 లక్షల ఫలితాల రికార్డులు, అడ్మిట్ కార్డ్ పీడీఎఫ్‌లు యాక్సెస్ చేసేలా ఉన్నాయని రాసుకొచ్చారు.

Advertisement

అభ్యర్థుల సమాచారం దుర్వినియోగం కాలేదు- ఐఐటీ రూర్కీ

ఇది 0.05 శాతం కంటే తక్కువ డేటా మాత్రమేనని ప్రస్తావించారు. వస్తున్న ఆరోపణలపై ఐఐటీ రూర్కీ రియాక్ట్ అయ్యింది. ఎథికల్ హ్యాకర్ ఈ లోపాన్ని గుర్తించి తమకు చెప్పిన వెంటనే అప్రమత్తమయ్యామని వెల్లడించింది. ఆ సమస్యను సరిదిద్ది, డేటాకు మరొకరు యాక్సెస్ చేసుకోకుండా నిరోధించామని తెలియజేసింది.

సదరు క్లౌడ్ స్టోరేజ్ కేవలం రీడ్-ఓన్లీ మోడ్‌లో ఉందని, డేటాలో కేవలం 0.05 శాతం కంటే తక్కువ సమాచారానికి చాలా పరిమితంగా యాక్సెస్ లభించిందని స్పష్టం చేసింది. దీనివల్ల అభ్యర్థుల మార్కులు, ర్యాంకులు, కేటగిరీతో సహా పరీక్ష ఫలితాలపై ఎలాంటి ప్రభావం పడలేదని తెలిపింది. అభ్యర్థులకు సంబంధించిన సమాచారం దుర్వినియోగం కాలేదని, డేటాను పెద్ద ఎత్తున డౌన్‌లోడ్ చేయలేదని ఐఐటీ రూర్కీ తెలిపింది.

ALSO READ: టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

ఈ విషయంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చింది. ప్రవేశ ప్రక్రియ సమగ్రతను కాపాడాలనే తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఐఐటి రూర్కీ ప్రకటన చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్, జోస్యా కౌన్సెలింగ్ ప్రక్రియల సమగ్రతను కాపాడుకోవడానికి పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపింది.

 

 

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×