E-Paper
Advertisement

ఐఐటీల్లో ప్రవేశం.. జేఈఈ మెయిన్స్-2026 రెండో విడత పరీక్ష మొదలు, విద్యార్థులు తప్పక పాటించాలి

ఐఐటీల్లో ప్రవేశం.. జేఈఈ మెయిన్స్-2026 రెండో విడత పరీక్ష మొదలు, విద్యార్థులు తప్పక పాటించాలి
Advertisement

JEE Main 2026, 2nd Phase Exams: దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశానికి రెండో విడత పరీక్ష ఏప్రిల్ రెండు అనగా (గురువారం) నుంచి మొదలైంది. ప్రతిష్గాత్మకమైన సంస్థల్లో సీటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు విద్యార్థులు. పరీక్షకు వెళ్లే ముందు విద్యార్థులు కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాయి.

జేఈఈ మెయిన్స్-2026 రెండో విడత పరీక్ష మొదలు

Advertisement

దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీ, ఐఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్-2026 రెండో విడత ప్రవేశ పరీక్ష గురువారం నుంచి మొదలైంది.  ఇందుకోసం దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది వరకు హాజరైనట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 2 అనగా గురువారం నుంచి పరీక్షలు మొదలైంది. నేషనల్  టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

దీనికి సంబంధించి విద్యార్థుల కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఏ చిన్న పొరపాటు చేసినా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు. జేఈఈ మెయిన్-2026 సెష‌న్ 2 పరీక్ష రెండు విడతలుగా జరగనుంది. ఈ పరీక్షలు ఆరు రోజులపాటు జరగనున్నాయి. ఏప్రిల్ 2 నుంచి మొదలైంది. 4, 5, 6, 8 తేదీల్లో జరుగుతుంది. అలాగే బీఆర్క్ లేదా ప్లానింగ్‌కు సంబంధించి ఏప్రిల్ ఏడున పరీక్ష జరగనుంది.

Advertisement

విద్యార్థులకు గమనిక.. పాటించిన సూచనలు ఇవే

నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే విద్యార్థులకు అడ్మిట్ కార్డుల‌ను విడుద‌ల చేసింది. పరీక్షా విధానం అంతా ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఈ పరీక్ష రెండు విధాలుగా జరుగుతుంది. పైన ప్రకటించిన తేదీల ప్రకారం ఉదయం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 వ‌ర‌కు, అలాగే మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయ‌త్రం 6 వ‌ర‌కు జరుగుతుంది.

తొలి విడత రాసి పాసైన విద్యార్థులు రెండో విడత కూడా హాజరయ్యారు. మెయిన్స్‌లో మంచి ర్యాంకు తెచ్చుకుంటే ఈజీ అవుతుందని ఆలోచన చేస్తున్నారు. రెండిటిలో విద్యార్థుల బెస్ట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని అఖిల భారత ర్యాంకులను వెల్లడిస్తుంది ఎన్‌టీఏ. మెయిన్‌ ఉత్తీర్ణత సాధించినవారు మాత్రమే మే నెలలో జరిగే అడ్వాన్స్‌డ్‌ అర్హ‌త పొందుతారు. ప్రస్తుతం రాస్తున్న జేఈఈ మెయిన్స్-2026 ఫలితాలను ఏప్రిల్ 20న ప్రకటించే అవకాశం ఉంది. అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌ మే మూడో వారం అంటే 17న పరీక్ష జరగనుంది.

ALSO READ: కేజీబీవీ అడ్మిషన్లు గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే 

విద్యార్థులు త‌మ హాల్‌టికెట్‌ల‌ను ప‌రీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా మీ ఐడీ ప్రూఫ్‌ కూడా ఉండాలి. ఆన్‌లైన్‌లో పరీక్ష కావడంతో ఎలాంటి తొంద‌ర‌పాటు చేయ‌కూడదు. జేఈఈ మెయిన్స్ ఎప్పటి మాదిరిగా మూడు లేదా నాలుగు రకాల ప్రశ్నలు వస్తుంటాయి. తొలుత బాగా వ‌చ్చిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇస్తే సమయం ఆదా అవుతుంది. కఠినంగా ఉన్న ప్ర‌శ్న‌ల‌కు కాస్త సమయం ఎక్కువ కేటాయించవచ్చు. అనుమానంతో ఆన్స‌ర్ ఇస్తే బుక్కవుతారు. చివర పావుగంటలో మొత్తం ప‌రీక్ష‌ను మరోసారి చెక్ చేసుకోండి. విలువైన సూచనలు పాటిస్తే విజయం మీ సొంతం.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×