E-Paper
Advertisement

JEE Main Result-2026: జేఈఈ మెయిన్-2026 ఫలితాలపై లేటెస్ట్ న్యూస్.. నాలుగు రోజులు తర్వాత

JEE Main Result-2026: జేఈఈ మెయిన్-2026 ఫలితాలపై లేటెస్ట్ న్యూస్.. నాలుగు రోజులు తర్వాత
Advertisement

JEE Main Result-2026: JEE మెయిన్-2026 తొలి సెషన్ ఫలితాలపై చల్లటి కబురు చెప్పింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. షెడ్యూల్ ప్రకారం ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదల కావాల్సివుండగా, ఈనెల 16న విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

జేఈఈ మెయిన్-2026 ఫలితాలపై లేటెస్ట్ న్యూస్

Advertisement

కారణాలు ఏమైనా కావచ్చు. JEE మెయిన్-2026 తొలి సెషన్ ఫలితాలపై కొత్త కబురు చెప్పింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థ. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫలితాలు ఫిబ్రవరి 12న అనగా ఇవాళ విడుదల కావాలి. అయితే అనివార్య కారణాల వల్ల ఈనెల 16 కు విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేసింది.

ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్ తుది సమాధాన కీ, ఫలితాలను ఫిబ్రవరి 12న ప్రకటించాలి. బుధవారం రాత్రి లేకుంటే గురువారం ఉదయం ఫలితాలు వెలువడతాయని విద్యార్థులు భావించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూశారు. తాజాగా JEE మెయిన్-2026 తొలి సెషన్ ఫలితాలు ఫిబ్రవరి 16కు వాయిదా వేసింది.

Advertisement

ఫిబ్రవరి 16న ఫలితాలు.. దరఖాస్తు ప్రక్రియ కొనసాగింపు

ఫలితాలు డిలే కావడంతో జేఈఈ మెయిన్ సెషన్-2కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల 25న రాత్రి 9 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. సెషన్-2 పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9 వరకు జరుగుతాయని ఇప్పటికే ప్రకటించారు అధికారులు.

ఈసారి JEE మెయిన్-2026 తొలి సెషన్‌కు దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేస్తున్నారు. వారిలో 13 లక్షల మంది హాజరయ్యారు. గతేడాది జనవరి తొలి సెషన్‌లో మొత్తం 12 లక్షల 58 వేల విద్యార్థులు హాజరైన విషయం తెల్సిందే.

ALSO READ: ఎన్ఐసీలో 376 ఉద్యోగాలు.. రూ.1,12,400 జీతం బ్రో

JEE మెయిన్ 2026 తొలి సెషన్ పరీక్ష జనవరి 21 నుంచి జనవరి 29 వరకు జరిగాయి. పరీక్ష ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించారు అధికారులు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మరొక పేపర్ పరీక్ష జరిగింది.

ఫలితాలు ప్రకటించిన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లు jeemain.nta.nic.in, nta.ac.in ల్లో స్కోర్‌ కార్డ్‌ తనిఖీ చేసుకోవచ్చు. ఫలితాలకు ముందే తుది సమాధాన కీ వెలువడనుంది. అయితే ఫలితాలు ఆన్సర్ కీకి సంబంధించి ఖచ్చితమైన సమయం ఇంకా ప్రకటించలేదు.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×