BigTV English

BEL: బెల్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం, ఈ అర్హత ఉంటే జాబ్ మీదే..

BEL: బెల్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం, ఈ అర్హత ఉంటే జాబ్ మీదే..

BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ అర్హతలు ఉన్న వారు బెల్‌లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి గౌరవప్రదమైన జీతం ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పోస్టులు, వెకెన్సీలు, విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు, జీతం, తదితర వివరాల గురించి తెలుసుకుందాం.


ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) కాంట్రాక్ట్ విధానంలో ఖాళీగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ ట్రైనీ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్‌ 30వ తేదీ వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోట్: దరఖాస్తుకు ఇంకా 5 రోజులే గడువు ఉంది.


మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 40

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో సీనియర్ సాఫ్ట్ వేర్ ట్రైనీ-1, జూనియర్ సాఫ్ట్ వేర్ ట్రైనీ-1, సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు:

సీనియర్ సాఫ్ట్ వేర్ ట్రైనీ-1 : 15 పోస్టులు

జూనియర్ సాఫ్ట్ వేర్ ట్రైనీ-1 : 15 పోస్టులు

సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్-1 : 10 పోస్టులు

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంసీఏ(సీఎస్), బీసీఏ, బీఎస్సీ (సీఎస్, ఐటీ), బీఈ/బీటెక్‌(సీఎస్‌/ఐఎస్‌/ఐటీ డేటా సైన్స్‌ & ఇంజినీరింగ్‌/ఏఐ/ఏఐ ఇంజినీరింగ్‌ పాసై ఉంటే సరిపోతుంది. వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 30

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. 2025 జూన్ 1 నాటికి సీనియర్ సాఫ్ట్ వేర్‌కు 28 ఏళ్లు వయస్సు మించరాదు. జూనియర్ సాఫ్ట్‌వేర్‌కు 26 ఏళ్లు, సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌కు 40 ఏళ్ల వయస్సు మించరాదు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సీనియర్ సైంటిస్ట్ పోస్టుకు రూ.150 ఫీజు ఉంటుంది. జూనియర్ సాఫ్ట్ వేర్‌కు రూ.100 ఫీజు ఉంటుంది. సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ కు రూ.450 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.

ఉద్యోగ ఎంపిక ప్రకియ: రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

వేతనం: ఉద్యోగాన్ని బట్టి జీతాన్ని నిర్ణయించారు. సీనియర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రూ.35వేల జీతం ఉంటుంది. జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌కు రూ.25,000 జీతం ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌కు రూ.60,000 జీతం ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://bel-india.in/

ALSO READ: NICL: డిగ్రీ అర్హతతో జాబ్స్.. జీతం అక్షరాల రూ.90వేలు, ఇంకా వారం రోజులే సమయం మిత్రమా

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 40

దరఖాస్తుకు చివరి తేది: జూన్ 30

జీతం: ఉద్యోగాన్ని బట్టి రూ.25వేల నుంచి రూ.60వేల వరకు..

Related News

APSRTC: ఇది గోల్డెన్ ఛాన్స్.. ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలు, ఇంకా 4 రోజులే గడువు

AIIMS Mangalagiri: మంగళగిరిలో ఉద్యోగాలు.. ఒక్క ఇంటర్వ్యూతోనే జాబ్, రూ.1,50,000 జీతం

BEL Notification: బీటెక్ అర్హతతో బెల్‌లో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.40వేలు, ఇంకెందుకు ఆలస్యం

IBPS Notification: ఇంకా ఒక్క రోజే.. ఇలాంటి అద్భుతమైన ఛాన్స్ మళ్లీ రాదు, డిగ్రీ ఉంటే జాబ్ ఉన్నట్టే..!

RBI Recruitment: రూ.78,450 జీతంతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా 3 రోజులే మామ.. మిస్ అవ్వొద్దు

SSC SI: 2861 ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఈ జాబ్ కొడితే ఫ్యామిలీ అంతా సెట్, క్లియర్‌కట్ వివరాలు ఇదిగో..

APMSRB: రాష్ట్రంలో రూ.1,51,370 జీతంతో భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే లైఫ్ సెట్ అయినట్టే, పూర్తి వివరాలివే

SSC Recruitment: ఎస్ఎస్‌సీ నుంచి మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. ఈ అర్హత ఉంటే సరిపోతుంది, పూర్తి వివరాలివే..

Big Stories

×