Diabetes control: ఈ రోజుల్లో చాలా మంది డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మన దేశంలో మెటబాలిక్ డిజార్డర్‌తో ఎందరో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రలో చేయడం చాలెంజుగా టాస్క్‌గా మారింది. కానీ మన జీవన విధానంలో కొన్ని మార్పుల వల్ల ఈ సమస్యను తగ్గించవచ్చని చెబుతున్నారు.
పుదీనా..
పుదీనా కూడా మంచి రీఫ్రెష్‌మెంట్ హెర్బ్. దీనిని తీసుకుంటే షుగర్ ఉన్నవారికి చాలామంచిది. పుదీనాలో విటమిన్ ఎ, ఐరన్, ఫోలేట్, మాంగనీస్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ బాడీలో ముఖ్య పనులని చేస్తాయి. అందులో బ్లడ్ ప్యూరీ ఫై చేసి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను బ్యాలెన్స్ చేయడం. కాబట్టి, పుదీనాని తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలంటే వీటిని నేరుగా తినొచ్చు. లేదా టీలా చేసుకుని తాగొచ్చు.
తులసి..
తులసి ప్రతి ఇంట్లో ఉండే పవిత్రమైన మొక్క .. దీనిని తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు, జ్వరాలు వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ నేపథ్యంలోనే డయాబెటిస్ కూడా కంట్రోల్ అవుతుంది. తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఎంజైమ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలని బ్యాలెన్స్ చేస్తాయి. ఈ ఆకుల్ని ఉదయం లేవగానే ఫ్రెష్ అప్ అయి 10,15 నోట్లో వేసుకుని నమలండి. దీంతో బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది.
మామిడాకులు..
మామిడి ఆకులు తోరణాలకు మాత్రమే కాదు.. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మామిడాకుల్ని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీనికోసం తాజాగా ఉన్న కొన్ని మామిడి ఆకులని నీటిలో వేసి 15 నిమిషాల వరకూ మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఆ నీటిని వడకట్టి దీనిని మనం పరగడపున తాగాలి. రోజూ క్రమం తప్పకుండా తాగితే తప్పకుండా ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.
వేపాకు..
వేపాకు తినాలి అంటే అందరూ అమ్మో చేదు.. అని భయపడుతారు. కానీ దీనిని తీసుకోవడం వల్ల డయాబెటిస్ చాలా వరకూ కంట్రోల్ అవుతుంది. వేపాకుల్లో ఫ్లేవనాయిడ్స్, ట్రైటెర్పనాయిడ్స్, యాంటీ వైరల్ కాంపౌండ్స్, గ్లైకోసైడ్స్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయి. వీటిని ఎలా తీసుకోవాలంటే.. కొన్ని వేపాకులను తీసుకుని ఎండబెట్టుకోవాలి. తర్వాత బ్లెండర్‌లో వేసి మెత్తగా పొడిలా చేయాలి. దీనిని కొద్ది మోతాదులో రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోండి. దీంతో షుగర్ కంట్రోల్ అవుతుందని పలు వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: కిచెన్‌లో నూనె జిడ్డు వదలడం లేదా? ఇలా చేస్తే దగదగ మెరిసిపోద్ది..
కరివేపాకు..
కరివేపాకు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కరివేపాకు డయాబెటిస్‌ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎంతో ముఖ్యం.. రోజూ కొన్ని ఆకులను నమలడం వల్ల డయాబెటిస్ సమస్యలను నివారించవచ్చు.
అలాగే డయాబెటిస్‌ను నియంత్రించడానికి, మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, సమతుల్య ఆహారం తీసుకోవాలి. దీంతో మీ రక్తంలో చక్కెర స్థాయిలను ఇట్టే తగ్గిపోతాయి.