E-Paper
Advertisement

OFMK: ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌‌లో ఉద్యోగాలు.. సొంత రాష్ట్రంలో 70వేల జీతం, డోంట్ మిస్

OFMK: ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌‌లో ఉద్యోగాలు.. సొంత రాష్ట్రంలో 70వేల జీతం, డోంట్ మిస్
Advertisement

OFMK: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.ఆర్మ్‌డ్‌ వెహికిల్‌ నిగమ్‌ లిమిటెడ్‌కు చెందిన ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌(OFMK).. నుంచి పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. డిబీఈ/బీటెక్‌, పీజీ, పీహెచ్‌డీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు- వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, తదితర విధానాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.

హైదారాబాద్‌, సంగారెడ్డి ఎద్దుమైలారంలోని ఆర్మ్‌డ్‌ వెహికిల్‌ నిగమ్‌ లిమిటెడ్‌కు చెందిన ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌(OFMK).. లో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్‌ 28వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

Advertisement

మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 17

ఇందులో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. సీనియర్ మేనేజర్, జూనియర్ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

పోస్టులు – వెకెన్సీలు:

సీనియర్‌ మేనేజర్‌: 01  పోస్టు
జూనియర్‌ మేనేజర్‌: 16 పోస్టులు

విభాగాలు: ఆర్మౌర్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌/ఐటీ, ఎలక్ట్రకల్‌, మెటలార్జీ, సీఏడీ స్పెషలిస్ట్‌, మెకానికల్‌, మెకానికల్‌ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, పీజీ, పీహెచ్‌డీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా  పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. సీనియర్‌ మేనేజర్‌కు 45 ఏళ్లు; జూనియర్‌ మేనేజర్‌కు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం:  నెలకు సీనియర్‌ మేనేజర్‌కు రూ.70,000, జూనియర్‌ మేనేజర్‌కు రూ.30,00 జీతం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ:  విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా ది డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌/హెచ్‌ఆర్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేది: 2025 నవంబర్ 28

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×