ARMY PUBLIC SCHOOL: డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్ లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్ లైన్‌లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. డిగ్రీ పాసైన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్ (ARMY PUBLIC SCHOOL) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 20వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
వెకెన్సీల సంఖ్య: 2
ఆర్మీ పబ్లిక్ స్కూల్ సికింద్రాబాద్ లో వైస్ ప్రిన్సిపల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
వైస్ ప్రిన్సిపల్: 1 పోస్టు
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 1 పోస్టు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఈడీ పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 20
వయస్సు: 2025 జూన్ 20 వ తేది నాటికి 55 ఏళ్ల వయస్సు మించరాదు. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులక మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. నెలకు వైస్ ప్రిన్సిపల్ ఉద్యోగానికి రూ.52,500 జీతం ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగానికి రూ.42,400 జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
చిరునామా: ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్ కే పురం, సికింద్రాబాద్ – 500056 కు దరఖాస్తు పంపాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://apsrkpuram.edu.in/
ALSO READ: ECET-2025 Results: తెలంగాణ ఈసెట్-2025 రిజల్ట్స్ వచ్చేశాయ్.. ర్యాంక్ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం వెకెన్సీల సంఖ్య: 2
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 20