Telangana ECET-2025 Results: తెలంగాణ ఈసెట్ -2025 ఫలితాలు విడుదలయ్యాయి. కాసేపటి క్రితమే అధికారులు ఫలితాలను విడుదల చేశారు. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ర్యాంక్ కార్డు కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్ ను కూడా అధికారులు ప్రకటించనున్నారు.
అఫీషియల్ వెబ్ సైట్: ecet.tgche.ac.in
తెలంగాణ ఈసెట్- 2025 ఫలితాల్లో 93.87 శాతం పాస్ పర్సెంటేజ్ నమోదైంది. అభ్యర్థులకు వచ్చిన ర్యాంకుతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈసెట్ ర్యాంక్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
ఫస్ట్ అఫీషియల్ వెబ్ సైట్ ecet.tgche.ac.in లోకి వెళ్లండి. తర్వాత హోం పేజీలో కనిపించే ర్యాంక్ కార్డు ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ అభ్యర్థు హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతోంది. ఆ వివరాలన్నింటిని సరిగ్గా నమోదు చేయండి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ పై నొక్కాలి. ఆ వెంటనే ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతోంది. ఆ తర్వాత ర్యాంక్ కార్డును డౌన్ లోడ్ చేసుకొని భద్రపరుచుకోవాలి.
ALSO READ: NMDC Notification: హైదరాబాద్ NMDCలో 995 ఉద్యోగాలు.. జీతం రూ.35,040, ఈ అర్హత ఉంటే చాలు!
తెలంగాణలో మే 12న ఈసెట్ ఎగ్జామ్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. అర్హత సాధించిన వారికి పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) అభ్యర్థులకు 2025-26 ఎడ్యుకేషనల్ ఇయర్ లో బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో సెకండ్ ఇయర్ లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎగ్జామ్ రాసిన రెండు రోజులకు మే 14వ తేదీన తెలంగాణ ఈసెట్ 2024 ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను విద్యాధికారులు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఆ తర్వాత రెండు రోజుల వరకు అంటే మే 16 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించారు.ఈ క్రమంలోనే ఇవాళ ఫైనల్ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈసారి జరిగిన పరీక్షకు మొత్తం 18,928 మంది (96.22%) స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు.
ALSO READ: NTPC Limited: బీటెక్ అర్హతతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. అక్షరాల రూ.2,00,000 జీతం