Kamal Haasan: కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమా థగ్ లైఫ్. ఎన్నో సంవత్సరాల తర్వాత మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ నటించటం తో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి..గతం లో వీరి కాంబో లో నాయకుడు చిత్రం విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. తాజాగా చెన్నైలో థగ్ లైఫ్ ఆడియో లాంచ్ ఈవెంట్ ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా కమలహాసన్ తన రాజకీయా జీవితం పై, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.ఆ వివరాలు చూద్దాం..
రాజకీయాల్లోకి వచ్చింది అందుకే..
కమల్ హాసన్ మాట్లాడుతూ.. సీఎం కావాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. తమిళనాడు రాష్ట్ర ప్రజలు నా వంతు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజల కోసం మేము వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. అవన్నీ ఎంతో బాగ జరుగుతున్నాయి . నిదానంగా అనుకున్నది సాధిస్తాం. అంతేకానీ ఒకేసారి సీఎం కుర్చీలో కూర్చోవాలని నాకు లేదు. ప్రజలకు సేవే నాకు ముఖ్యం.థగ్ లైఫ్ మూవీ ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ మూవీ కథ విన్న టైంలోనే ఇది ఎంతో సక్సెస్ అవుతుందని నమ్మకంతోనే నేను ఓకే చెప్పాను. ఈ సినిమా ఎంతో గొప్ప సినిమా. ప్రేక్షకులు ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది. ఇక రాజకీయ జీవితం అంటారా నేను ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాను. ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాలేదు. తమిళనాడు రాష్ట్ర ప్రజలు నా వంతు సేవ చేయాలి. ప్రజల కోసం అనేక కార్యక్రమాలు ప్రస్తుతం చేస్తున్నాను. ఈ నా ప్రయాణంలో నాతో భాగమైన వారందరికీ ధన్యవాదాలు. నాతో పాటు పనిచేస్తున్న టీం నిజంగా ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు, అందుకు నేనెంతో గర్వపడుతున్నాను. ఇక ఈ సినిమా సక్సెస్ అవ్వడం కోసం మూవీ టీమ్ అంతా ఎంతో కష్టపడింది. మా సినిమా థగ్ లైఫ్ విషయంలో మేము నమ్మకంగా ఉన్నాం. ఈ సినిమాను డిస్ట్రిబ్యూషన్ కూడా మేమే చేస్తున్నాం. మేము ఒక మంచి చిత్రాన్ని రూపొందించాము ప్రేక్షకులు మంచిగా రిజల్ట్స్ ఇస్తారు. అన్న ఆశ భావంతోనే ఈ సినిమాని మేమే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. మా నిర్మాణ సంస్థలో ఇలాంటి ఎన్నో గొప్ప చిత్రాలు మరెన్నో రూపొందిస్తాం. మీ వంతు సహకారంగా సినిమాని సక్సెస్ చేయండి అని కమల్ తెలిపారు. ఇక కమల్ మక్కల్ నీది మయ్యం (MNM) అధ్యక్షుడు గా రాజకీయాలలో వున్నారు.
జూన్ 5 న రిలీజ్ ..
ఇక చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ విచ్చేశారు. కమల్ తో ఆయనకున్న అనుబంధాన్ని ఈ వేదిక మీద పంచుకున్నారు. ఈ చిత్రంలో కమలహాసన్, శింబు, త్రిష, ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఐశ్వర్య లక్ష్మి, గౌతమ్ కార్తీక్, దుల్కర్ సల్మాన్, జయం రవి, నాజర్, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్యపాత్రలు పోషించనున్నారు.ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
KA Paul : ఛీ ఛీ.. డబ్బుల కోసం ఏమైనా చేస్తారా… ప్రభాస్, బాలయ్య దుమ్ము దులిపిన కేఏ పాల్