BigTV English
Advertisement

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్..

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్..

CBI Recruitment: ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ముంబై లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్ మెంట్(రిక్రూట్ మెంట్ అండ్ ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్, రెగ్యులర్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హులైన అభ్యర్థులు అందరూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.


నిరుద్యోగులకు ఇది సువర్ణవకాశం. ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్… రెగ్యులర్‌ విధానంలో పలు జోన్లలో 266 జోన్‌ బేస్డ్‌ ఆఫీసర్‌- జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్కేల్‌ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 9వ తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 266


దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 9

ఆన్ లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.

ఆన్ లైన్ పరీక్ష తేది: 2025 మార్చి

ఇందులో పలు రకాలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో జోన్ బేస్ డ్ ఆఫీసర్- జూనియర్ మేనేజ్ మెంట్ స్కేల్1 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

పలు జోన్లలో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. అహ్మదాబాద్, చెన్నై, గువాహటి, హైదరాబాద్ జోన్లలో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

విద్యార్హత:  గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటిన నుంచి ఏదైనా విబాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా కలిగి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD), మెడికల్, ఇంజినీరింగ్, చార్టెడ్‌ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: 2024 నవంబర్ 30 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.

వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480- రూ.85,920 వరకు వేతనం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ తదితర ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.850 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175 ఉంటుంది

పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ సంప్రదించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.centralbankofindia.co.in/en

అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది. అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

Also Read: PM Narendra Modi: ఢిల్లీ ప్రజలు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు.. ఇక మేం ఏంటో చూపిస్తాం: ప్రధాని మోదీ

ముఖ్యమైనవి:

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- రెగ్యులర్‌ ప్రాతిపదికన వివిధ జోన్‌లలో జోన్‌ బేస్డ్‌ ఆఫీసర్‌- జేఎంజీఎస్‌ స్కేల్‌ 1 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ  పాసై ఉండాలి.

వేతనం: నెలకు రూ.48,480- రూ.85,920 వరకు వేతనం ఉంటుంది.

Related News

BRO Notification: టెన్త్ క్లాస్ అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. జీతమైతే అక్షరాల రూ.63,200.. ఇంకెందుకు ఆలస్యం

SBI Notification: డిగ్రీ అర్హతతో స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఇలాంటి నోటిఫికేషన్ రేర్, జాబ్ వస్తే లైఫ్ అంతా సెట్

RITES Notification: డిగ్రీ, డిప్లొమా అర్హతతో భారీగా జాబ్స్.. ఉద్యోగ ఎంపిక విధానమిదే, ఇంకా వారం రోజులే

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు.. రూ.1,77,500 జీతం, టెన్త్, డిగ్రీ పాసైతే చాలు

PNB LBO: నిరుద్యోగులకు పండుగే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు బ్రో

SEBI JOBS: సెబీలో ఆఫీసర్ ఉద్యోగాలు.. రూ.1,26,100 జీతం, దరఖాస్తు ప్రక్రియ షురూ

BEL Notification: బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. బీటెక్ పాసైతే చాలు, జీతం అక్షరాల రూ.1,40,000

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. జిందగీలో ఇలాంటి జాబ్ కొట్టాలి భయ్యా.. లైఫ్ అంతా సెట్

Big Stories

×