BigTV English

Monalisa: తంతే బూరెల బుట్టలో పడిన మోనాలిసా.. మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. ?

Monalisa: తంతే బూరెల బుట్టలో పడిన మోనాలిసా.. మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. ?

Monalisa: మోనాలిసా.. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు. తేనే కళ్ల సుందరి.. అంటూ ముద్దుగా నెటిజన్స్ పిలుస్తున్నారు. ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళలో   పూసలు అమ్ముకుంటూ ఆకర్షించే నవ్వుతో .. అందమైన కళ్లతో అందరిని తన చూపుతూనే తన వైపు తిప్పుకున్న అమ్మాయి మోనాలిసా. ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయిన వారిలో  ఈ చిన్నది కూడా ఉంది.


ఇక సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది అంటే.. త్వరలోనే హీరోయిన్ గా మారుతుంది అని అర్ధం. అన్నట్లుగానే మోనాలిసా హీరోయిన్ గా కూడా మారిపోయింది. ఒక్క వీడియో ఈ చిన్నదాని ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది. అంతేనా తంతే బూరెల బుట్టలో పడినట్లు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్  సినిమాలో ఛాన్స్ పట్టేసింది. ది డైరీ ఆఫ్‌ మణిపూర్‌  అనే సినిమాలో ఆమె ఒక కీలక  పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్  స‌నోజ్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

కొన్నిరోజుల క్రితం సనోజ్ మిశ్రా .. మోనాలిసా ఇంటికి వెళ్లి, ఆమె పేరెంట్స్ తో మాట్లాడి మరీ ఒప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక సినిమా ఛాన్స్ వచ్చాకా  మోనాలిసా మరింత పాపులర్ అయ్యింది. ఎక్కడ చూసినా ఆమె వీడియోలు, ఫొటోలే కనిపిస్తున్నాయి. ఇక  రెండు రోజుల నుంచి  మోనాలిసా రెమ్యూనరేషన్ ఇది అంటూ ఒక వార్త సోషల్ మీడియాను హల్చల్ చేస్తుంది.


Y. Vijaya: ఆ హీరో ఎప్పుడెప్పుడు టచ్ చేస్తాడా అని ఎదురుచూశా..

ది డైరీ ఆఫ్‌ మణిపూర్‌  సినిమాకోసం మోనాలిసా.. అక్షరాలా  రూ.21 ల‌క్ష‌లు అందుకుంటుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద అమౌంట్. స్టార్ హీరోయిన్లు కాకుండా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్లకు కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ లేదు అంటే ఆశ్చర్యం లేదు. కానీ, మొదటి సినిమాకే మోనాలిసా ఇంత రెమ్యూనరేషన్ అందుకుంటుంటే మిగతా హీరోయిన్లు సైతం ముక్కున వేలేసుకుంటున్నారట.

ఇక ఈ ఒక్క సినిమాతోనే మోనాలిసా  ఆగలేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూసే ఇండస్ట్రీ ఇది. అందులోకి అడుగుపెట్టగానే అమ్మడు కూడా అలానే మారిపోయింది. ఈ సినిమా ఇచ్చిన ఫేమ్ తో మోనాలిసా లోకల్ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా మారిపోయిందంట. టోటల్ గా ఈ చిన్నది వాణిజ్య ప్రకటనల కోసం రూ. 15 లక్షలు అందుకుందని టాక్. ఇలా  మోనాలిసా ఒక్క సినిమాతో రెండు జేతులా సంపాదిస్తుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంత నిజం ఉంది  అనేది తెలియాల్సి ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×