Prime Minister Narendra Modi: ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ విజయోత్సవ సంబరాలు జరుపుతోంది. పార్టీ ఆఫీసుకు కాసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. అలాగే కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమావేశానికి హాజరయ్యారు. పార్టీ కార్యాలయ ప్రాంగణం మోడీ.. మోడీ అనే నినాదాలతో మార్మోగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
Also Read: CM Chandrababu Naidu: హస్తినాలో బీజేపీ విక్టరీ.. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు వైరల్
ఢిల్లీ ఓటర్లకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ‘ఢిల్లీ ప్రజలకు ఈ రోజు పండుగ. ప్రజలను ఇవాళ ఆమ్ ఆద్మీ నుంచి విముక్తి లభించింది. ఢిల్లీ ప్రజల్లో నూతన ఉత్సహం కనిపిస్తోంది. హస్తినా ప్రజలు మమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు. మీ విశ్వాసాన్ని అభివృద్ది రూపంలో చూపిస్తాం. ఢిల్లీని వికిసిత్ రాజధానిగా మార్చే అవకాశం ఇచ్చారు. డబ్బుల్ ఇంజినీర్ సర్కార్ తో ఢిల్లీలో అభివృద్ధి వేగం అవుతోంది. మీ ప్రేమకు ప్రతిఫలాన్ని అభివృద్ధి రూపంలో చూపిస్తాం. ఈ గెలుపులే అసలైన విజేతలు ఢిల్లీ ప్రజలే. ఢిల్లీ ప్రజలు బీజేపీని మనసారా ప్రేమించారు. షార్ట్ కట్ రాజకీయాలకు ఓటర్లు షాక్ ఇచ్చారు. ఢిల్లీలో గెలిచామంటే దేశం అంతా దీవించినట్లే. పరిపాలన అంటే డ్రామాలు ఆడడం కాదు. కానీ పదేళ్ల పాటు ఆ డ్రామాల రాజకీయాలే ప్రజలు అనుభవించారు. వికిసిత్ విజన్ తో ఢిల్లీని పరుగులు పెట్టిస్తాం. అబద్దపు రాజకీయాలు ఎక్కువ రోజులు నడవవు. ఎన్డీఏ సుపరిపాలనకు నిర్వచనం. ఏపీలో చంద్రబాబు ట్రాక్ రికార్డ్ నిరూపించుకున్నారు. బిహార్ లో నితీష్ కుమార్ ఎన్డీఏపై విశ్వాసం ఉంచారు’ అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
Also Read: Delhi Elections: 26 ఏళ్ల తర్వాత హస్తినాలో రెపరెపలాడిన కాషాయ జెండా.. కేజ్రీవాల్ ఓటమికి కారణం ఇదేనా..?
ఢిల్లీని వాయు కాలుష్యం పట్టి పీడిస్తోంది. పనితీరు చూసే బీజేపీ పట్టం కడుతున్నారు. మోదీ గ్యారెంటీ ఇచ్చారంటే అది కచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఢిల్లీ ప్రజలు ఇచ్చిన ప్రేమకు అనేక రేట్లు తిరిగి ఇస్తాం. నిజమైన అభివృద్ధి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో చూడవచ్చు. ఢిల్లీని అత్యున్నత నగరంగా తీర్చిదిద్దుతాం. ఆప్ పార్టీ అంటేనే అవినీతి పార్టీ. ఆప్ అవినీతి లెక్కలన్నీ బయటకు తీస్తాం. లిక్కర్ స్కాంతో ఢిల్లీ ప్రతిష్టను దెబ్బ తీశారు. ఢిల్లీలో దోచుకున్న సొమ్మును తిరిగి రప్పిస్తా. యమునా నదిని ఆమ్ ఆద్మీ అపవిత్రం చేసింది’ అని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ పై స్పందించారు. ఓటముల విషయంలో కాంగ్రెస్ కు గోల్డ్ మెడల్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో వరుసగా 6 ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదని అన్నారు. జీరో సీట్లతో రెండు పర్యాయాలు హ్యాట్రిక్ కొట్టిందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులను ప్రధాని అర్బన్ నక్సల్స్ తో పోల్చి మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు అర్బన్ నక్సల్స్ భాష మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రాల్లో వివిధ వర్గాల ప్రజలను రెచ్చగొట్టడమే కాంగ్రెస్ ఉన్న పని అని ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.