Adventure Thriller OTT : డిజిటల్ ప్లాట్ ఫామ్ ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమాలు అన్నీ మంచి సక్సెస్ టాక్ ను అందుకుంటున్నాయి. ఇటీవల రిలీజ్ అవుతున్న స్టార్ హీరోల సినిమాలు అన్నీ కూడా థియేటర్లలో హిట్ అవ్వడమే కాదు. ఓటీటీ లో కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటున్నాయి. అయితే ఒక సినిమా రిలీజ్ అవ్వగానే మరో సినిమా రిలీజ్ అవుతూ మూవీ లవర్స్ ను అలరిస్తున్నాయి. మాములు కుటుంబ కథా చిత్రాల కన్నా ఎక్కువగా హారర్, థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో డిమాండ్ ఎక్కువ.. తాజాగా ఇక్కడకు మరో అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు ఆ మూవీ టైటిల్ ఏంటి? ఏ ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ అవుతుందో? ఇప్పుడు ఒకసారి చూద్దాం..
మూవీ & ఓటీటీ..
రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ అప్సర రాణి గురించి అందరికీ తెలుసు.. ఈమె ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోని హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాలో తక్కువగా నటించినా ఐటెం సాంగ్స్ చేస్తూ. ఇప్పుడు ఏకంగా థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. గతంలో వచ్చిన సినిమాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తే ఇప్పుడొచ్చిన సినిమాలతో కుర్రాలను వణుకు పుట్టించేలా చేసింది అప్సర రాణి.. నటించిన తాజా చిత్రం తలకోన మూవీ ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా ఓటీటీలోకి సడన్ ఎంట్రీ ఇచ్చేసింది.. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంటల్ విధానంలో విడుదలైంది. 99 రూపాయలు రెంటల్ ఛార్జెస్‌గా ఫిక్స్ చేశారు.. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన 10 నెలల తర్వాత ఓటిటిలో రిలీజ్ అవ్వబోతుంది. భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా వచ్చిన ఈ మూవీలో అప్సర రాణి ప్రధాన పాత్రలో నటించింది. అజయ్ ఘోష్, అశోక్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. నగేష్ నారదాసి దర్శకత్వం వహించాడు. గత ఏడాది మార్చిలో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. అప్పరరాణి గ్లామర్, యాక్టింగ్ తలకోన మూవీ ప్లస్ అయ్యింది..
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..
ఇలా చూడడం ఆమె అభిమానులు కింద షాక్ అవుతున్న కూడా ఈ సినిమాలో ఆమె నటనకు ఫాన్స్ ఫీదా అవుతున్నారు. ఈ మూవీలో సారా అనే మోడల్ పాత్రలో అప్సర రాణి నటించింది. కంటెస్ట్‌లో సారా విజేతగా నిలుస్తుంది. ఆ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు తలకోన ఫారెస్ట్ మధ్యలో ఉన్న ఓ రిసార్ట్‌కు వెళుతుంది.. అక్కడ హోమ్ మినిస్టర్ కొడుకుతో సారా గొడవపడుతుంది. తర్వాత స్టొరీ మొత్తం అడ్వెంచర్ గా మారుతుంది. సారపై కక్ష పెంచుకున్న ఆ మినిస్టర్ కొడుకు ఆమెను ఎలాగైనా అంతం చేయాలని ఫారెస్ట్ లో పెద్ద ప్లాన్ వేస్తాడు.. మినిస్టర్ మనుషుల బారి నుంచి సారా ఎలా తప్పించుకున్నది? అడవిలోని సంజీవకోనలో బయటి ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఓ స్వామిజీ చేస్తోన్న ప్రయోగాలకు సంబంధించిన గుట్టును సారా ఎలా బయటపెట్టింది. అనేది ఈ మూవీలో చూపించారు. స్టోరీ మొత్తం కాస్త పాతదే అయిన కూడా అప్సర గ్లామర్ మాత్రం ఈ మూవీకి ప్లస్ అయింది.. థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఇన్ని రోజులకు ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.. మరి ఇక్కడ ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..