Jobs in ESIC: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంస్, ఎండీ, డీఎన్‌బీ, ఎండీఎస్ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీల తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఢిల్లీ, ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషణ్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వివిధ విభాగాల్లో ఈ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. అనాటమి, అనస్థీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కమ్యునిటీ మెడిసిన్, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ(ఎఫ్‌ఎంటీ), జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ఓబీజీవై, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, సైకియార్టీ, రేడియోడయాగ్నోసిస్ విభాగాల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 243
పోస్టులు – వెకెన్సీలు
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 243
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఎంస్, ఎండీ, డీఎన్‌బీ, ఎండీఎస్‌లో పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 40 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. నెలకు రూ.67,700 నుంచి రూ.2,08,700 జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 15
దరఖాస్తు ఫీజు: రూ.500 ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.
చిరునామా: ది రీజినల్ డైరెక్టర్, ఈఎస్‌ఐ కార్పొరేషన్, పంచదీప్ భవన్, సెక్టార్-16, (లక్ష్మీనారాయణ మందిర్ వద్ద), ఫరీదాబాద్-121002
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబందించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://esic.gov.in/recruitments
ALSO READ: IOCL Jobs: ఇంటర్, డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. మంచివేతనం, దరఖాస్తు కొన్ని రోజులే గడువు
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 243
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 15