ముంబై బీచ్ లో ఊహించని ఘటనతో అందరూ షాకయ్యారు. రాకాసి అలలు ఒడ్డున నిలిపి ఉన్న ఓ మినీ బస్సు సమద్రంలోకి లాక్కెళ్లాయి. అక్కడే ఉన్న కోస్ట్ గార్డ్స్ వెంటనే స్పందించడంతో బస్సులోని ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. అతి కష్టం మీద వారు ఆ మినీ బస్సును ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ఘటన ముంబైలోని గోరాయ్ బీచ్ దగ్గర జరిగింది.
కొంత మంది పర్యాటకులు ముంబై బీచ్ చూడాలనుకున్నారు. అందరూ కలిసి ఓ మినీ టూరిస్ట్ బస్సును మాట్లాడుకున్నారు. అందరూ కలిసి బీచ్ కు వచ్చారు. వచ్చీ రావడంతోనే ఊహించని సంఘటన ఎదురయ్యింది. బస్సులో ఓ మహిలతో పాటు మొత్తం ఆరుగురు టూరిస్టులు ఉన్నారు. బీచ్ లోకి దిగి ఎంజాయ్ చేయాలనుకున్నారు. డ్రైవర్ కు చెప్పి బీచ్ ఒడ్డుకు తీసుకెళ్లాలని చెప్పారు. వారు చెప్పినట్లుగానే డ్రైవర్ బస్సును తీసుకెళ్లి బీచ్ ఒడ్డులో ఆపాడు. కిందికి దిగుదాం అనుకున్న సమయంలోనే రాకాసి అలలు దూసుకొచ్చాయి. ఒక్కసారిగా వాటి తీవ్రతకు బస్సు ఒడ్డు మీది నుంచి సముద్రంలోకి జారిపోయింది.
మినీ బస్సు అలల ధాటికి సముద్రంలోకి వెళ్తున్న విషయాన్ని వెంటనే కోస్ట్ గార్డులు పసిగట్టారు. పోలీసులకు సమాచారం అందించారు. అందరూ అక్కడికి చేరుకుని బస్సులోని వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత కష్టపడి మినీ బస్సును కూడా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆదివారం నాడు మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని వెల్లడించారు. తాము గమనించి ఉండకపోయి ఉంటే మినీ బస్సు సహా అందులోని టూరిస్టులు సముద్రంలోకి కొట్టుకుపోయేవారని చెప్పారు.
A minibus got stuck on Gorai beach after its driver took it for a spin on the sand post tourist drop-off. The vehicle was trapped during high tide but luckily no passengers were inside. Locals later helped pull it out. #Mumbai #Gorai @mid_day pic.twitter.com/kOAuX6YGrs
— Ranjeet Shamal Bajirao Jadhav (@ranjeetnature) September 8, 2025
Read Also: పరాయి మగాడితో అడ్డంగా దొరికిన భార్య.. తట్టుకోలేక భర్త..
అటు ఈ ఘటనకు కారణం డ్రైవర్ నిర్లక్ష్యం అని పోలీసులు తేల్చారు. అతడితో పాటు ఆ బస్సు ఓనర్ మీద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బీచ్ లలో ఎక్కువ అలలు వస్తున్న సమయంలో భద్రతా ప్రోటోకాల్ ను పాటించనందుకు వారిపై కేసు ఫైల్ చేసినట్లు తెలిపారు. స్థానికులతో పాటు పర్యాటకులు బీచ్ లో భద్రతా హెచ్చరికలను పాటించాలని సూచించారు. బీచ్ లో ఉన్న అధికారులకు పర్యాటకులు సహకరించాలన్నారు. ముఖ్యంగా బీచ్ లోపలికి వాహనాలు తీసుకెళ్లకూడదన్నారు. అలల తీవ్రత ఎక్కువ ఉన్న సమయంలో బీచ్ కు వెళ్లకపోవడం మంచిదన్నారు. ఆటు పోట్లను గమనించి, అధికారుల సూచనలు అనుగుణంగా బీచ్ లోకి వెళ్లాలన్నారు. భద్రతా హెచ్చరికలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Also: కొట్టేయడం నా హాబీ.. చోరీ కేసులో మహిళ సర్పంచ్ అరెస్ట్, ఆమె చెప్పింది వింటే ఫ్యూజులు ఔట్!