Tollywood: సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణమే. అందులో కొంతమంది జీవితాంతం తమ వైవాహిక బంధాన్ని సంతోషంగా కొనసాగిస్తే.. మరి కొంతమంది మధ్యలోనే విడాకులు తీసుకొని విడిపోయారు. ఇంకొంతమంది పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారు కూడా ఉన్నారు. అలా కొంతమంది ఇండస్ట్రీతో సంబంధంలేని వ్యక్తులను భాగస్వాములుగా చేసుకున్నవారు కూడా ఉన్నారు. అయితే అలా పెళ్లి చేసుకున్న హీరోలు అందరూ కూడా.. బడా బిజినెస్ మెన్ ల కూతుర్లని వివాహం చేసుకోవడం గమనార్హం. మొత్తానికైతే సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు బిజినెస్ మెన్ లకు అల్లుళ్ళుగా వెళ్లారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం.
ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తారక్ (Tarak)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సినీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ తోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన.. లక్ష్మీ ప్రణతి (Lakshmi pranati)ని వివాహం చేసుకున్నారు. ఈమె తండ్రి పేరు నార్ని శ్రీనివాసరావు. వ్యాపారవేత్త. ఒక మీడియా ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. లక్ష్మీ ప్రణతి వాళ్ళ అమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వయానా మేనకోడలు.
అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సినీ బ్యాగ్రౌండ్ తోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈయన భార్య పేరు స్నేహ రెడ్డి (Sneha Reddy) 2011లో వివాహం చేసుకున్నారు. స్నేహ తండ్రి పేరు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. రాజకీయ నాయకుడు మాత్రమే కాదు వ్యాపారవేత్త కూడా.. సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఈయనదే.
రామ్ చరణ్ – ఉపాసన..
మెగా ఫ్యామిలీ వారసుడిగా పేరు సొంతం చేసుకున్న రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా చలామణి అవుతున్నారు. ఈయన భార్య పేరు ఉపాసన (Upasana). 2012లో వీళ్ళ పెళ్లి జరిగింది. ఉపాసన తండ్రి పేరు అనిల్ కామినేని. KEI గ్రూప్ అనే వ్యాపార సంస్థ ఆయనదే. ఇక ఉపాసన తాత ప్రతాప్ సి రెడ్డి అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ను స్థాపించారు.
రానా దగ్గుబాటి – మిహికా బజాజ్..
సినీ ఇండస్ట్రీ నుంచి అడుగుపెట్టిన మరో వారసుడు రానా దగ్గుబాటి (Rana Daggubati). మూవీ మొగల్ రామానాయుడు వారసుడు. కోవిడ్ టైంలో మిహికా బజాజ్ ను ఈయన వివాహం చేసుకున్నారు. ఈమె ఒక ఇంటీరియర్ డిజైనర్. ఈమె వాళ్ళ అమ్మ Krsala jewels అనే కంపెనీలో క్రియేటివ్ హెడ్ గా, డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
ఇకపోతే టాలీవుడ్ హీరోలే కాదు కోలీవుడ్, మాలీవుడ్ హీరోలు కూడా వ్యాపారవేత్తలకు అల్లుళ్లుగా మారారు.
విజయ్ దళపతి – సంగీత సోర్ణ లింగం..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathi) ఇటీవలే రాజకీయ పార్టీ కూడా స్థాపించిన విషయం తెలిసిందే.. ఈయన భార్య పేరు సంగీత సోర్ణ లింగంఈమె తండ్రి శ్రీలంకలో ప్రముఖ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు.
దుల్కర్ సల్మాన్ – అమల్ సూఫియా..
మాలీవుడ్ మెగాస్టార్ గా పేరు సొంతం చేసుకున్న మమ్ముట్టి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు దుల్కర్ సల్మాన్. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. ఈయన భార్య పేరు అమల్ సూఫియా. ఈమె తండ్రి కూడా చెన్నైలో వ్యాపారవేత్తగా పేరు సొంతం చేసుకున్నారు.
ALSO READ:Nagarjuna: అందుకే సోషల్ మీడియా అంటే అసహ్యం.. నాగార్జున కీలక వ్యాఖ్యలు!