E-Paper
Advertisement

బీటెక్ అర్హతతో NPCIL‌లో 330 ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం, డోంట్ మిస్

బీటెక్ అర్హతతో NPCIL‌లో 330 ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం, డోంట్ మిస్
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. గేట్ (GATE) స్కోరు ఆధారంగా ఈ నియామకాలు చేపడుతున్నారు. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

మొత్తం 330 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ వంటి కీలక ఇంజినీరింగ్ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 330

విద్యార్హత: సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ (ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతతో పాటు చెల్లుబాటు అయ్యే గేట్ స్కోరును తప్పనిసరిగా కలిగి ఉండాలి.

Advertisement

వయస్సు: వయోపరిమితి విషయానికొస్తే.. 2026 ఏప్రిల్ 30 నాటికి అభ్యర్థుల వయస్సు 26 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయో సడలింపు వర్తిస్తుంది. దివ్యాంగులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూబీడీ అభ్యర్థులతో పాటు మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించబడుతుంది.

స్టైఫండ్: ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో ఆకర్షణీయమైన స్టైపెండ్ లభిస్తుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత వారికి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ హోదాలో పోస్టింగ్ ఇస్తారు. కెరీర్ ఎదుగుదల పరంగా ఇది అద్భుతమైన అవకాశం.

ఆసక్తి గల అభ్యర్థులు గడువు ముగిసేలోగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేది: 2026 ఏప్రిల్ 30

ALSO READ: రూ.30,000లోపు బడ్జెట్లో.. మార్కెట్లోని బెస్ట్ ఏసీలు.. ఫీచర్లు, ధర వివరాలివే!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×