APPSC FBO Results 2025: ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అటవీశాఖలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇటీవల స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. ఈ పరీక్షల ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్ష ఫలితాలను అభ్యర్థులు https://portal-psc.ap.gov.in/Default డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన 2346 మంది అభ్యర్థుల రోల్ నెంబర్లను ప్రకటించారు. స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది.
ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మొత్తం 435 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు, 256 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు, 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జులై 22,2025న పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 07, 2025న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. అక్టోబర్ 9న స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను విడుదల చేసింది. మెయిన్ పరీక్షకు తాత్కాలికంగా అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను కమిషన్ వెబ్‌సైట్ www.psc.ap.gov.inలో ఉంచింది.
స్క్రీనింగ్ పరీక్ష ఫలితాల్లో మొత్తం 16,191 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. మెయిన్స్ పరీక్షల అనంతరం మెడికల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియేన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత తుది ఫలితాలు విడుదల చేస్తారు.
Also Read : AP DSC 2026: ఏపీ డీఎస్సీపై బిగ్ అప్డేట్.. జనవరిలో నోటిఫికేషన్.. టెట్ ఎప్పుడంటే?
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో లైబ్రేరియన్, ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసులో అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఏపీ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ నియామక పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. అభ్యర్థుల ప్రాథమిక ఎంపిక జాబితాను వెబ్‌సైట్ లో ఉంచింది.