E-Paper
Advertisement

UIDAI Jobs : పరీక్ష లేకుండా UIDAIలో ఉద్యోగాలు.. త్వరగా అప్లై చేయండి

UIDAI Jobs : పరీక్ష లేకుండా UIDAIలో ఉద్యోగాలు.. త్వరగా అప్లై చేయండి
Advertisement

Jobs in UIDAI : ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి గుడ్ న్యూస్. ఆధార్ కార్డులను తయారు చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI )లో ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు UIDAI దరఖాస్తులు కోరుతుంది. 56 సంవత్సరాల లోపు వారు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. 2024లో ఉద్యోగాల భర్తీకి UIDAI నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు జూన్ 13, 2024లోగా దరఖాస్తు ఫారమ్ ను సమర్పించాల్సి ఉంటుంది.

ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం www.uidai.gov.in అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఏ కేటగిరీకి చెందిన అభ్యర్థులైనా.. ఎలాంటి రుసుము చెల్లించనక్కర్లేదు. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత అభ్యర్థి డాక్యుమెంట్, మెడికల్ వెరిఫికేషన్ కు పిలుస్తారు. అభ్యర్థుల వయస్సును బట్టి రిక్రూట్ మెంట్ చేస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. అన్ని వర్గాలవారికి వయో సడలింపు ఉంటుంది.

Advertisement

అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలి. డిపార్ట్ మెంట్ జారీ చేసిన దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకుని అందులో అడిగిన సమాచారాన్ని నింపి, అవసరమైన పత్రాలను జతచేయాలి. HR, UIDAI, 7th Floor, MTNL Telephone Exchange, GD Somani Marg, Cuffe Parade, Colaba, Mumbai -400005 అడ్రస్ కు దరఖాస్తుల్ని పంపాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30 వేలు జీతం ఉంటుంది.

UIDAIలో మరొక పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిప్యూటీ డైరెక్టర్ పోస్టుకు జూన్ 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు అడ్మినిస్ట్రేషన్/ లీగల్/ ఎస్టాబ్లిష్ మెంట్/ హెచ్ఆర్/ ఫైనాన్స్/ అకౌంట్స్ / బడ్జెటింగ్/ వాల్యూయేషన్/ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్ తదితర వాటిల్లో పనిచేసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు ఐదేళ్ల వరకూ.. నెలకు రూ.67,700 నుంచి రూ.2,08,700 వరకూ జీతం ఉంటుంది.

Advertisement

 

 

 

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×