BigTV English

Congress Charge sheet: బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు మాయం: సీఎం రేవంత్

Congress Charge sheet: బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు మాయం: సీఎం రేవంత్

Congress Releases a Charge sheet against BJP Government: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  గత పదేళ్ల బీజేపీ పాలనపై కాంగ్రెస్ ఛార్జిషీట్ ను గురువారం గాంధీభవన్ లో విడుదల చేశారు.  ‘నయవంచన.. పదేళ్ల మోసం.. వందేళ్ల విధ్వంసం.. పదేండ్ల కన్నీళ్లను యాదుంచుకుందాం.. ప్రజాద్రోహుల పాలనను అంతం చేద్దాం’ అంటూ ఛార్జిషీట్ ను విడుదల చేశారు. ఛార్జిషీట్ విడుదల అనంతరం నేతలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు పలువురు మంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పదేండ్లలో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆయన అన్నారు. ‘ఆరెస్సెస్ భావజాలం, బీజేపీ విధానం రిజర్వేషన్లు రద్దు చేయడమే. ఆరెస్సెస్ ఆలోచనను దేశంపై రుద్దాలనే కుట్ర చేస్తోంది. వంద సంవత్సరాల్లో రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆరెస్సెస్ కంకణం కట్టుకుంది. తమకి మెజారిటీ వస్తే రిజర్వేషన్లు తీసేయడం సులభం అని మోదీ అనుకుంటున్నాడు. మోదీ దేశాన్ని మోసం చేశాడు. డబుల్ ఇంజిన్ అంటే అదానీ, ప్రధాని’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

‘పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. పదేండ్ల మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. నల్లధనం తెస్తానన్న ప్రధాని మోదీ రూ. 10 పైసలు కూడా తేలేదు. 55 రూపాయల పెట్రోల్ మోదీ వచ్చాక రూ. 110 చేశాడు. జీఎస్టీ పేరుతో మోదీ దోపిడీ చేశాడు. దేవుడి పేరు చెప్పే బీజేపీ అగరబత్తీలపై కూడా జీఎస్టీ వేశారు. చిన్న పిల్లల పెన్సిల్, రబ్బర్ లపై కూడా జీఎస్టీ వేశారు. 14 మంది ప్రధాన మంత్రులు చేసిన అప్పుల కంటే మోదీ ఒక్కడే డబుల్ అప్పులు చేశాడు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారులు అన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు అమ్మేశాడు. దేశాన్ని తప్పకుండా ఎక్స్ రే తీస్తాం. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతాం. ఓబీసీ రిజర్వేషన్లు 27 శాతాన్ని 50 శాతానికి పెంచుతారనేది బీజేపీ భయం. మండల్ ఉద్యమానికి వ్యతిరేకంగా బీజేపీ కమండల్ ఉద్యమాన్ని తెచ్చింది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లు తీసేయడానికి ఉపయోగపడుతుంది. కొందరు స్థానిక రాజకీయాల కోసం రిజర్వేషన్లు తీసేయడానికి సిద్ధమైన బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. రిజర్వేషన్లు కావాలా? వద్దా అనే దానికి ఈ ఎన్నికలు రెఫరెండం. రిజర్వేషన్లు ఉండాలి అనేవాళ్ళు కాంగ్రెస్ కి, వద్దు అనేవాళ్ళు బీజేపీకి ఓటేయండి’ అని రేవంత్ పేర్కొన్నారు.


పదేళ్లుగా తెలంగాణకు బీజేపీ చేసిందేమీలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పెట్టుబడిదారులకు వనరులను దోచిపెడుతున్నారని, ఈస్టిండియా కంపెనీలాగా.. బీజేపీ కూడా సంపదంతా కొందరికే ఇస్తుందని.. యువతకు ఉద్యోగాలు ఇస్తామని ఇయ్యలేదని భట్టి విక్రమార్క అన్నారు.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×