Big Stories

Viveka wife letter to jagan: జగన్‌బాబు నీకిది తగునా, నిందితులకే రక్షణా?

Viveka wife letter to Jagan: ఏపీలో రాజకీయాలు కాక రేపుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీని వైఎస్ వివేకానంద కేసు వెంటాడుతోంది. ఈ కేసు వ్యవహారంపై సీఎం జగన్ గురువారం పులివెందులలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివేకానంద ఫ్యామిలీ రియాక్ట్ అయ్యింది.

- Advertisement -

ఈ క్రమంలో వివేకా భార్య వైఎస్ సౌభాగ్యమ్మ సీఎం జగన్‌కు ఓపెన్ గా లెటర్ రాశారు. చిన్నాన్న హత్యకు కారకులైనవారికి టికెట్ ఇవ్వడంతోపాటు రక్షణ కూడా కల్పిస్తున్నారని అందులో రాసుకొచ్చారు. 2009లో వైఎస్ఆర్ చనిపోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించావో.. 2019లో వివేకా హత్యకు గురైనప్పుడు నీ చెల్లి సునీత కూడా అంతే వేదన అనుభవించిందని తెలిపారు. కుటుంబంలోని వారే ఈ హత్యకు కారణమైతే, వాళ్లకు నీవు రక్షణగా ఉండడం ఎంతో బాధించిందని వెల్లడించారు.

- Advertisement -

నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలన్నది మీ చిన్నాన్న కోరిక. మా పట్ల మీ టీవీ, పేపర్, పార్టీ నేతల విమర్శలు చేయడం నీకు తగునా? అంటూ ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్లను హేళన చేస్తూ నిందలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సునీతకు మద్దతుగా పోరాడుతున్న షర్మిలను టార్గెట్ చేస్తుంటే.. కనీసం నోరు ఎత్తకుండా ఉండడం ఎంతవరకు సబబు అని లేఖలో పేర్కొన్నారు.

కుటుంబ సభ్యుడిగా కాకపోయినా ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. ఇంకా బాధించే విషయం ఏంటంటే.. హత్యకు కారణమైన వారికి మళ్లీ ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం సమంజసమా? ఇలాంటి దుశ్చర్య ఏమాత్రం నీకు మంచిదికాదన్నారు. ధర్మం కోసం ఆలోచన చేయమని వేడుకున్నట్లు అందులో ప్రస్తావించారు. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగా న్యాయం, ధర్మం వైపు నిలబడాలని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు.

అంతకుముందు సీఎం జగన్ పులివెందుల సభలో మాట్లాడుతూ వివేకా ఫ్యామిలీపై దుమ్మెత్తిపోశారు. వివేకాను చంపింది ఎవరో జిల్లా ప్రజలకు తెలుసన్నారు. ఆయనకు రెండో భార్య ఉన్నది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు.  అవినాష్‌రెడ్డి తప్పుచేయలేదని తాను బలంగా నమ్మానని, అందుకే ఎంపీ టికెట్ కూడా ఇచ్చారని చెప్పుకొచ్చారు. అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని, పసుపు మూకల కుట్రలో మన చెల్లెమ్మలు భాగస్వాములు అయ్యారన్నారు. ముఖ్యంగా స్వార్థంతో ఎవరు కుట్రలు చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News