E-Paper
Advertisement

Office Assistant Jobs: ఆ జిల్లాలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైనా అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే..

Office Assistant Jobs: ఆ జిల్లాలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైనా అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే..
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. వైఎస్సార్ కడప జిల్లాలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులకు  ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. టెన్త్, డిప్లొమా, డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, తదితర విధానాల గురించి క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వైఎస్సార్‌ కడప జిల్లాలోని దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 26 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Advertisement

పోస్టుల వివరాలు: 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో ప్రధానంగా ఏఎన్ఎం గ్రేడ్-III (మహిళలు) పోస్టులు 15 ఉన్నాయి. మిగిలిన వాటిలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 2 ఖాళీలు ఉన్నాయి. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ 2,  ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 3 వెకెన్సీలు ఉన్నాయి. వీటితో పాటు జూనియర్ ఆఫీస్ అకౌంటెంట్ ఒకటి, స్టోర్ కీపర్ ఒక వెకెన్సీ ఉన్నాయి. జూనియర్ శానిటరీ వర్కర్ ఒకటి అలాగే ఆఫీస్ వాచర్ ఒక ఖాళీ అందుబాటులో ఉంది.

Advertisement

విద్యార్హత: 

పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. పదో తరగతి ఉత్తీర్ణత నుంచి డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు. కొన్ని రకాల పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండటం తప్పనిసరి.

వయస్సు: 

అభ్యర్థుల వయస్సు 2026 జూలై 1 నాటికి 18 ఏళ్ల నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: 

ఈ నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రూప్-IV కేటగిరీ పోస్టులకు ఎటువంటి పరీక్షలు ఉండవు. కేవలం అభ్యర్థులు తమ విద్యార్హతల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇతర సాంకేతిక పోస్టులకు మాత్రం అవసరాన్ని బట్టి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ఎంపికైన వారు వైఎస్సార్‌ కడప జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ:

అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్ పద్ధతిలోనే సమర్పించాలి. పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన సర్టిఫికెట్స్ ను జతచేయాలి. ఈ దరఖాస్తులను ‘అసిస్టెంట్ డైరెక్టర్, దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం, వైఎస్సార్‌ కడప జిల్లా’ అనే చిరునామాకు పంపాలి.

చివరి తేది: 

దరఖాస్తులు సమర్పించడానికి 2026 మార్చి 20వ తేదీ సాయంత్రం లోపు గడువుగా నిర్ణయించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిశీలించబోమని అధికారులు స్పష్టం చేశారు.

ALSO READ: CSC Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. ఆధార్ సూపర్ వైజర్ ఉద్యోగాలు, ఈ అర్హత ఉంటే జాబ్ వచ్చేస్తది..!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×