AP High Court Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్ర హైకోర్టు నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి లా క్లర్క్ జాబ్స్ భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్టు విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష, ఫీజు లేకుండా ఆసక్తి, అర్హతలు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 5
ఇందులో లా క్లర్స్ జాబ్స్ ఖాళీగా ఉన్నాయి.
వయస్సు: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
విద్యార్హత: 5 సంవత్సరాల లా డిగ్రీ చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000 వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు చివరి తేది: లా క్లర్క్ కాంట్రాక్టు ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు 17th జనవరి 2025 తేదీలోగా అప్లికేషన్స్ ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు పంపించాల్సిన అడ్రస్: రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్), హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి, నేలపాడు, గుంటూరు డిస్ట్రిక్ట్, AP, పిన్ కోడ్ – 52223కు పంపించవలెను.
ఉద్యోగ ఎంపిక విధానం: హైకోర్టు లా క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా, అమరావతిలోని హైకోర్టులో ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు: లా క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
కావాల్సిన సర్టిఫికేట్స్: Ap హైకోర్టు ఉద్యోగాలకు Apply చేయడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.
Also Read: CM Revanth Reddy: సివిల్స్ అభ్యర్థులకు సీఎం రేవంత్ సూచనలు.. కేవలం ప్రోత్సాహం మాత్రమే
1. లా డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
2. 4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
3. కాస్ట్ సర్టిఫికేట్స్, ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్స్ పరగణిలోకి తీసుకుంటారు.