Tips For Facial Glow: చలికాలంలో చర్మం తీవ్ర సమస్యలను ఎదుర్కుంటుంది. ఈ సీజన్‌లో స్కిన్ తరుచుగా పొడి బారుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల కూడా అంతగా ఫలితం ఉండదు. అందుకే హోం రెమెడీస్ వాడాలి. హోం రెమెడీస్ వాడటం వల్ల స్కిన్ మృదువుగా మారుతుంది. అంతే కాకుండా కొన్ని రకాల ఫేస్ మాస్కులు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. వీటిని తరుచుగా వాడటం వల్ల మీరు కూడా మెరుస్తూ కనిపిస్తారు. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఫేస్ మాస్కులను ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్ , తేనెతో ఫేస్ ప్యాక్:
యాపిల్ చర్మానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులోని ఫినోలిక్ యాసిడ్ చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అంతే కాకుండా చర్మంపై వచ్చే బ్లాక్ హెడ్స్ తొలగిస్తుంది. ఇదిలా ఉంటే తేనె చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. అంతే కాకుండా ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
ఎలా ఉపయోగించాలి ?
ఒక యాపిల్ తీసుకుని గ్యాస్ పై ఒక బౌల్ పెట్టి సగం వరకు నీళ్లు పోసి మరిగించాలి.యాపిల్ ఉడికిన తర్వాత దీనిని మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల తేనె వేసి మిక్స్ చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఉంచి శుభ్రం చేసుకోవాలి. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ గా చేస్తుంది.
స్ట్రాబెరీ, అలోవెరా జెల్‌తో ఫేస్ ప్యాక్ :
స్ట్రాబెరీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చలికాలంలో చర్మం క్లియర్ గా ఉంచుతుంది. అంతే కాకుండా చర్మ కణాలు వృద్ధి చెందడంలో కూడా ఉపయోగపడుతుందిజ అలోవెరా జెల్ ముఖాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని కాంతివతంగా మారుస్తుంది.
ఎలా ఉపయోగించాలి ?
3- 4 స్ట్రాబెరీలను తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల అలోవెరా జెల్ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత వాష్ చేయాలి. దీన్ని వారానికి 2 సార్లు ఉపయోగించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ లో తేనె కలిపి ముఖానికి అప్లై చేసినా కూడా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఇందులోని పోషకాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
బయట మార్కెట్ లో దొరికే ఫేస్ మాస్కులకు బదులుగా వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలాంటి ఖర్చు లేకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం చేసుకోవచ్చు.
Also Read: రోజు రోజుకు జుట్టు పలచబడుతోందా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్
ఈ రెండు పద్దతుల్లో మీరు ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడవచ్చు. ఇవి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. అంతే కాకుండా డ్రై స్కిన్ సమస్యను కూడా తొలగిస్తాయి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.