CM Revanth Reddy: సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను అన్నివిధాలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. దేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి నుంచి సివిల్స్‌లో ఎంపికవుతారని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవాలన్నారు.
సివిల్స్ మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్థులకు ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయ హస్తం’ పేరిట చెక్కులను పంపిణీ చేశారు. 20 మంది అభ్యర్థులకు ఒకొక్కరికి రూ. లక్ష రూపాయల చెక్కును అందజేశారు. శనివారం ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. ఆర్ధిక సాయం కాదని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంగా భావించాలన్నారు. కష్టంతో కమిట్మెంట్ ఉంటేనే విజయం వరిస్తుందన్నారు. ఇంటర్వ్యూకు వెళ్లే ప్రతీ ఒక్కరూ సివిల్స్‌లో సెలెక్ట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఈ ప్రభుత్వం ఆలోచించేది యువత భవిష్యత్ కోసమన్నారు. సివిల్స్‌లో తెలంగాణ అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలన్నదే మా ఉద్దేశమన్నారు. ప్రస్తుతం బీహార్ నుంచి అత్యధికంగా సివిల్స్‌లో రాణిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని వివరించారు.
ALSO READ: లగచర్ల కేసు.. కీలకంగా మారిన టెక్నికల్ ఎవిడెన్స్, దాడికి ముందు
దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి ఏడాదిలో 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. ఈ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 14 ఏళ్లుగా గ్రూప్-1 పరీక్ష నిర్వహించలేదని, అన్ని అడ్డంకులను అధిగమించి 563 గ్రూప్-1 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించామన్నారు.
మార్చి 31 లోగా ఆయా ఉద్యోగాల నియామకాలను పూర్తి చేయబోతున్నట్లు వివరించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని, పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు నష్టపోయారన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.
సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి ఆర్థిక సాయం అందించడం గర్వకారణమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇంటర్వ్యూ సమయంలో వారికి ఢిల్లీలో వసతి కల్పిస్తామని చెప్పుకొచ్చారు.
వెనుకబడిన బిహార్ నుంచే అత్యధికంగా సివిల్స్ లో రాణిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి
అలాంటి ప్రత్యేక శ్రద్ధ మన రాష్ట్రంలో కూడా ఉండాలి
అందుకే ఆర్థికంగా సహాయం అందించాలని రాజీవ్ సివిల్స్ అభయహస్తం ద్వారా రూ.లక్ష సాయం అందిస్తున్నాం
ఇది ఆర్ధిక సాయం కాదు… ప్రభుత్వం వారికి అందిస్తున్న… pic.twitter.com/yjAJVULy2u
— BIG TV Breaking News (@bigtvtelugu) January 5, 2025