E-Paper
Advertisement

MANAGE Hyderabad: అగ్రికల్చర్ మేనేజ్‌మెంట్ కొలువులు.. లక్షకు పైగా జీతం పొందే సువర్ణావకాశం.. దరఖాస్తుకు లాస్ట్ డేట్..?

MANAGE Hyderabad: అగ్రికల్చర్ మేనేజ్‌మెంట్ కొలువులు.. లక్షకు పైగా జీతం పొందే సువర్ణావకాశం.. దరఖాస్తుకు లాస్ట్ డేట్..?
Advertisement

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్  కొలువుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యవసాయ రంగంలో మేనేజ్‌మెంట్ సేవలను విస్తరించడంలో భాగంగా సంస్థలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేయాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు.

విద్యార్హత..

Advertisement

మొత్తం మూడు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. విద్యాార్హతలతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలని సంస్థ స్పష్టం చేసింది.

వయస్సు..

Advertisement

అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపులు వర్తిస్తాయి.

పోస్టుల సంఖ్య: 3

జీతం..

ఎంపికైన అభ్యర్థులకు వేతనం నెలకు రూ. 57,700 నుండి రూ. 1,82,400 మధ్య లభిస్తుంది. ఇతర కేంద్ర ప్రభుత్వ భత్యాలు కూడా అందుతాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

అభ్యర్థులు తమ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. దరఖాస్తు సమర్పించడానికి 2026 ఫిబ్రవరి 21 చివరి తేదీగా నిర్ణయించారు.

చివరి తేది: ఫిబ్రవరి 21

ఉద్యోగ ఎంపిక విధానం..

ఎంపిక విధానం పూర్తిగా రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థుల మెరిట్ ప్రాతిపదికన తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి పోస్టింగ్ ఇస్తారు. ఆసక్తి గల వారు గడువు లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

వ్యవసాయ విస్తరణ నిర్వహణలో నైపుణ్యం ఉన్న యువతకు ఈ ఉద్యోగాలు కెరీర్ పరంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మరిన్ని వివరాల కోసం మేనేజ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.manage.gov.in/

ALSO READ: Court Jobs: రూ.78,000 జీతం.. గౌరవప్రదమైన హోదా, కోర్టుల్లో ఉద్యోగాలు

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×