MSDL Recruitment 2024: ప్రభుత్వ రంగ సంస్థ మజగావ్ డాక్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 176 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను కోసం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేయవచ్చు.
మొత్తం ఖాళీగా సంఖ్య: 176 పోస్టులు
అర్హత: అభ్యర్థులు టెన్త్ అర్హతతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, ఎన్ ఏసీ పరీక్ష, డిప్లొమా, డిగ్రీ, పీజీ , ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.09.2024 నాటికి 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. మరికొన్ని పోస్టులకు వేర్వేరుగా వయోపరిమితిని నిర్ణయించారు.
ఎంపిక ప్రక్రియ: వ్రాత పరీక్ష, పని అనుభవం, ట్రేడ్/ స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Also Read: గుడ్ న్యూస్.. బీఐఎస్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 01.10.2024
పరీక్ష తేదీ: 31.10.2024.
జీతం: పోస్టులను భట్టి జీతం ఉంటుంది. ఐడీ-9 పోస్టులకు రూ.22000-83180, సెమీ స్కిల్డ్ గ్రేడ్ -1 పోస్టులకు రూ.13200-49910, స్కిల్డ్ గ్రేడ్ -1 పోస్టులకు రూ.17000-64360 ఇస్తారు.