Urine in Juice: ఫాస్ట్ ఫుడ్స్, బిర్యానీలు, బేకరీ ఐటమ్స్, పిజ్జాలు, బర్గర్లకు అలవాటై.. శరీర బరువు పెరిగిన వారు ఇప్పుడిప్పుడే బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా.. తమ రోజువారి డైట్ లో ఫ్రూట్స్, జ్యూస్ లు తీసుకుంటు ఉంటారు. ఇంట్లో ఉండేవారైతే హోమ్ ఫుడ్ తీసుకుంటారు. కానీ.. సొంత ఊళ్లకు దూరంగా ఉద్యోగాలు, చదువుల కోసం మెట్రో నగరాల్లో, ఇతర ఊళ్లలో ఉండేవాళ్లకు జ్యూస్ షాపులకు వెళ్లడం ఒక్కటే ఆప్షన్.
ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్స్ బౌల్, ఫ్రూట్ మిక్స్, ఇవే కాకుండా.. అనార్ నుంచి అవకాడో వరకూ అన్నిరకాల జ్యూస్ లు లభిస్తాయి. వందలు ఖర్చు చేసి ఫ్రూట్స్ కొనుక్కుని.. వాటిని జ్యూస్ చేసుకునేందుకు కష్టపడేకంటే రూ.50 నుంచి రూ.100 ఖర్చు చేస్తే ఈజీగా దొరికే జ్యూస్ ను తాగడానికే చాలా మంది ఇష్టపడుతుంటారు. కానీ.. ఒక ఘనుడు జ్యూస్ లో ఏం కలిపాడో తెలిస్తే.. జ్యూస్ తాగాలంటేనే భయపడతారు. దానిపై విరక్తి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంతకూ వాడేం కలిపారనా మీ డౌట్. యూరిన్..
మీరు చదివింది కరెక్టే. జ్యూస్ లో యూరిన్ కలిపాడో వ్యాపారుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో వెలుగుచూసింది. ఒకటి, రెండు కాదు.. ఆ షాపుకు జ్యూస్ తాగడానికి వచ్చేవారందరికీ ముత్రం కలిపిన జ్యూస్ లను అమ్ముతున్నాడని ఆరోపణలు వచ్చాయి. దాంతో వినియోగదారులు, స్థానికులు ఆ దుకాణదారుడిపై దాడి చేసి.. తీవ్రంగా చితకబాదారు.
Also Read: ఛీ, ఛీ.. సమోసాలో కప్ప కాలు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
అమీర్ ఖాన్ అనే వ్యక్తి ఖుషీ జ్యూస్ కార్నర్ పేరుతో ఒక జ్యూస్ షాపును నడుపుతున్నాడు. అయితే.. అక్కడికి జ్యూస్ తాగేందుకు వచ్చినవారు.. తమకు ఇచ్చే పండ్లరసాల్లో పసుపు రంగులో ఉన్న లిక్విడ్ ను కలపడాన్ని గమనించారు. ఏమిటని షాపులో ఉన్న వ్యక్తిని ప్రశ్నించగా.. టేస్ట్ కోసమని చెప్పి అబద్ధాలు చెప్పాడు. ఆ లిక్విడ్ ఏమిటని పరిశీలించగా యూరిన్ అని తేలింది. దీంతో పెద్ద గొడవ జరిగింది. అక్కడున్నవారంతా ఆ షాపు చుట్టూ గుమిగూడి అమీర్ ఖాన్ ను చితకబాదారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. జ్యూస్ స్టాల్ లో సోదాలు చేయగా.. సుమారుగా 1 లీటర్ మూత్రంతో నింపిన ఒక ప్లాస్టిక్ డబ్బా లభ్యమైంది. దానిని స్వాధీనం చేసుకుని అమీర్ ఖాన్ ను, అతని హెల్పర్ కైఫ్ ను అరెస్ట్ చేశారు. జ్యూస్ లో మూత్రం కలిపి అమ్ముతుండటం వెనుక ఉన్న కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి భాస్కర్ వర్మ వెల్లడించారు. అమీర్ ఖాన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఈ సంవత్సరంలోనే తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఐస్ క్రీమ్ లో ఓ వ్యక్తి వీర్యాన్ని కలిపి అమ్మిన ఘటన కలకలం రేపింది. బెరూనాథ్ పేరుతో ఫలూదా బండి నడిపే వ్యక్తి.. హస్తప్రయోగం చేసి, తన వీర్యాన్ని ఐస్ క్రీమ్ లో కలుపుతున్న ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వెలుగుచూసింది. ఇలా ఐస్ క్రీమ్ లో వీర్యం, జ్యూస్ లో యూరిన్ కలపడం వంటి వాటిని చూస్తుంటే.. వాటిని తినాలన్నా, తాగాలన్నా అసహ్యం కలుగకుండా ఉండదు మరి.
Aamir and Kaif were serving juice mixed with urine in their juice shop in Ghaziabad.
1 litre of urine was kept in a can, was seized from their shop.
Sonu Sood was a frequent visitor to this juice centre. pic.twitter.com/3LEZQAlKoj
— Rishi Bagree (@rishibagree) September 13, 2024