E-Paper
Advertisement

Medical Jobs: ఆ జిల్లా నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.1,90,000 వరకు జీతం

Medical Jobs: ఆ జిల్లా నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.1,90,000 వరకు జీతం
Advertisement

తెలంగాణ ప్రభుత్వ వైద్య విద్యా సంచాలకుల (DME) పరిధిలోని నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వివిధ బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన తాత్కాలికంగా చేపడుతున్నారు. వైద్య రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకావం. మొత్తం 62 ఖాళీలను భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

పోస్టుల వివరాలు:

Advertisement

ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక ప్రొఫెసర్ స్థానంతో పాటు 15 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తారు. వీటితో పాటు 32 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఉండగా.. 14 ట్యూటర్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ వంటి విభాగాల్లో నియామకాలు జరుగుతాయి.

వీటితో పాటు పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్ వంటి నాన్-క్లినికల్ విభాగాల్లోనూ అవకాశాలు కల్పించారు. క్లినికల్ విభాగాలైన పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, ఓబీజీ, డీవీఎల్, జనరల్ మెడిసిన్ వంటి ముఖ్యమైన విభాగాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

Advertisement

విద్యార్హత:

అర్హతల విషయానికి వస్తే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎండీ (MD), ఎంఎస్ (MS) లేదా డీఎన్‌బీ (DNB) పూర్తి చేసి ఉండాలి. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిబంధనల మేరకు విద్యార్హతలు కలిగి ఉండటం తప్పనిసరి. దరఖాస్తుదారులు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన వైద్యులు ఎంపికైన వారం రోజుల్లోగా రాష్ట్ర కౌన్సిల్‌లో తమ పేరును నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.

వయస్సు: గరిష్టంగా 69 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది.

జీతం:

ఉద్యోగంలో సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ప్రొఫెసర్‌గా ఎంపికైన వారికి నెలకు రూ. 1,90,000 చెల్లిస్తారు. అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ. 1,50,000 పారితోషికం ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాలో చేరిన వారికి రూ. 1,25,000 వేతనంగా లభిస్తుంది. ట్యూటర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 55,000 చొప్పున వేతనం అందుతుంది.

అర్హత ఉన్న వారు 2026 మార్చి 16వ తేదీన నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 02.00 గంటల వరకు నల్గొండలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్‌లో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి.

అభ్యర్థులు తమ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ , ఎక్స్ పీరియన్స్ లెటర్స్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్లను వెరిఫికేషన్ కోసం వెంట తీసుకురావాలి. ఎంపికైన అభ్యర్థులు వారం రోజుల్లోగా విధుల్లో చేరాల్సి ఉంటుంది.

ALSO READ: World’s Fastest Train: గంటకు 400 కిమీ వేగంతో దూసుకెళ్లే రైలు.. పరుగుకు సిద్ధం, ప్రపంచంలోనే ఫాస్టెస్ ట్రైన్ ఇది!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×