నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన న్యూఢిల్లీలోని ఎన్‌టీపీసీ లిమిటెడ్ భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 250 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ లేదా బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలో పని చేయాలనుకునే నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, వయస్సు, తదితర అంశాల గురించి స్పష్టంగా తెలుసుకుందాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 250
250 పోస్టులు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్) విభాగానికి చెందినవి. రిజర్వేషన్ల వారీగా చూస్తే జనరల్ కేటగిరీకి 109 పోస్టులు కేటాయించారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) 25 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇతర వెనుకబడిన తరగతులకు (OBC) 39 పోస్టులు ఉన్నాయి. షెడ్యూల్డ్ కులాల (SC) అభ్యర్థులకు 42 ఖాళీలు ఉన్నాయి. షెడ్యూల్డ్ తెగల (ST) వారికి 35 పోస్టులు కేటాయించారు.
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీఈ లేదంటే బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించి ఉండటం తప్పనిసరి. విద్యార్హతలతో పాటు సంబంధిత రంగంలో ఏడాది పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు: దరఖాస్తుదారుల వయస్సు 35 ఏళ్లకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
జీతం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ. 55,000 చొప్పున వేతనం లభిస్తుంది. ఇతర ప్రయోజనాలు కూడా సంస్థ నిబంధనల మేరకు అందుతాయి.
సెలక్షన్ ప్రాసెస్: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వివిధ దశల్లో సాగుతుంది. మొదట దరఖాస్తులను స్క్రీనింగ్ చేస్తారు. విద్యార్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ సాధించిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ అన్ని దశల్లో ప్రతిభ చూపిన వారిని తుది నియామకాలకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు: ఏప్రిల్ 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. మే 7వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ. 500 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు సహా మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది. ఆసక్తి గల వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.ntpc.co.in
ALSO READ: శ్రేయాస్ అయ్యర్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు..అందుకే ఇంత భయంకరంగా ఆడుతున్నాడు