నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్‌గ్రిడ్ దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మహారత్న హోదా కలిగిన ఈ ప్రతిష్టాత్మక సంస్థలో కొలువు సాధించాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 668 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో డిప్లొమా ట్రెయినీ (ఎలక్ట్రికల్, సివిల్, సర్వే) జూనియర్ ఆఫీసర్ ట్రెయినీ (హెచ్‌ఆర్, ఎఫ్ & ఏ) జూనియర్ టెక్నీషియన్ ట్రైయినీ (సర్వే) వంటి విభాగాలు ఉన్నాయి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 668
విద్యార్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ లేదా డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యార్హతలతో పాటు సంబంధిత పనిలో ఎక్స్ పీరియన్స్ ఉండటం తప్పనిసరి.
వయస్సు: అభ్యర్థుల వయోపరిమితి 2026 మే 11వ తేదీ నాటికి 27 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
స్టైఫండ్: ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు శిక్షణలో ఉంటారు. ఈ శిక్షణ కాలంలో పోస్టును బట్టి నెలకు రూ.21,000 నుంచి రూ.24,000 వరకు స్టైపెండ్ అందిస్తారు.
శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారిని సంస్థలో రెగ్యులర్ ఉద్యోగులుగా నియమిస్తారు. అప్పుడు వేతనంతో పాటు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కూడా అందుతాయి.
సెలెక్షన్ ప్రాసెస్: నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది. అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి పోస్టు స్వభావాన్ని బట్టి కంప్యూటర్ స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు.
ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికే తుది నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. అభ్యర్థులు పరీక్షా విధానం, సిలబస్ అంశాలను అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు.
ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రక్రియ 2026 ఏప్రిల్ 20వ తేదీన ప్రారంభం అవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్స్ తో సిద్ధంగా ఉండాలి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2026 మే 11గా నిర్ణయించారు.
గడువు ముగిసేలోపు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
దేశ ఇంధన రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న పవర్‌గ్రిడ్ వంటి సంస్థలో కెరీర్ ప్రారంభించడం వల్ల అభ్యర్థులకు భవిష్యత్తులో మంచి వృద్ధి ఉంటుంది. సుస్థిరమైన ఉద్యోగంతో పాటు సామాజిక గౌరవం దక్కుతుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు పవర్‌గ్రిడ్ అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శిస్తూ ఉండాలి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.powergrid.in/
ALSO READ: Amaravati: ఏపీకి మరొక భారీ పెట్టుబడి.. 300 ఎకరాల్లో పరిశ్రమ, రూ.8,175 కోట్ల పెట్టుబడి