Rashmika Mandanna: పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తెరకెక్కినప్పుడు అవి ప్రేక్షకులు రీచ్ అవ్వాలన్నా అదే రేంజ్‌లో ప్రమోషన్స్ కూడా చేయాలి. ప్రతీ భాషా ప్రేక్షకుడికి ఈ సినిమా గురించి తెలియాలంటే ప్రమోషనల్ టూర్స్ చేయాలి. అలా మొదట్లో పెద్దగా బజ్ లేకపోయినా ‘పుష్ప 2’ సినిమాకు కేవలం ప్రమోషన్స్‌తోనే ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రమోషన్స్ విషయంలో చాలా కష్టపడ్డాడు. తనతో పాటు రష్మిక మందనా కూడా ప్రమోషన్స్ విషయంలో బాగానే యాక్టివ్‌గా ఉంది. కానీ ‘పుష్ప 2’ విడుదలయ్యి రెండు నెలలు అయిన తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో రష్మిక డుమ్మా కొట్టింది. కానీ అలా ఎందుకు చేసిందో క్లారిటీ ఇచ్చింది.
ఇన్నాళ్లకు సక్సెస్ మీట్
డిసెంబర్ 6న ‘పుష్ప 2’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రీమియర్స్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం వల్ల మేకర్స్‌పై నిందపడింది. అందుకే ఆ తర్వాత పెద్దగా ఈవెంట్స్ ఏమీ చేయలేకపోయారు. కానీ అల్లు అర్జున్ మాత్రం సినిమాను ఇంత పెద్ద హిట్ చేసినందుకు తన నార్త్ ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాలని అనుకున్నాడు. అందుకే థాంక్యూ ఇండియా అనే ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేయగా దానికి హాజరయ్యాడు. ఇక ఇంతకాలం తర్వాత అల్లు అర్జున్ తెలుగు ఫ్యాన్స్ కోసం ‘పుష్ప 2’ (Pushpa 2) సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు.
గొప్ప సినిమా
సినిమా విడుదలయిన రెండు నెలల తర్వాత ‘పుష్ప 2’ కోసం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌కు రష్మిక మందనా డుమ్మా కొట్టింది. అసలు అలా ఎందుకు జరిగిందో చెప్తూ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. ‘నిన్న జరిగిన పుష్ప 2 థాంక్యూ మీట్‌లో నేను భాగం కాలేకపోయాను. కానీ కచ్చితంగా దీని గురించి కొన్ని మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. సుకుమార్ సార్, అల్లు అర్జున్ సార్, మైత్రీ మూవీ మేకర్స్‌కు థాంక్యూ. ఆడియన్స్‌లో నేను కూడా ఒకదాన్ని కాబట్టి ఇలాంటి గొప్ప సినిమా కోసం మీరంతా కష్టపడినందుకు థాంక్యూ. దీని ద్వారా మీరు మాకొక మాస్టర్ పీస్‌ను అందించారు’ అని చెప్పుకొచ్చింది రష్మిక మందనా (Rashmika Mandanna).
Also Read: ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం లేదా.. ఇంటిమేట్ సీన్స్‌కు సంబంధించిన ప్రశ్నపై నటి ఫైర్
అందరికీ థాంక్యూ
‘ఇక శ్రీవల్లిగా చెప్పాలంటే ఈ సినిమాకు నా మనసులో ఎప్పుడూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. మేము మా వల్ల అయినంత కష్టపడ్డాం. మాకు సపోర్ట్ చేయడానికి మంచి టీమ్ దొరికింది. డైరెక్షన్ టీమ్, ప్రొడక్షన్ టీమ్, కెమెరా డిపార్ట్మెంట్, లైట్ డిపార్ట్మెంట్, మేకప్, హెయిర్, కాస్ట్యూమ్, సెట్ బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్స్, డ్యాన్సర్స్.. ఇలా అందరు చాలా బాగా పనిచేశారు. మీ ప్రయాణంలో నన్ను కూడా భాగం చేసుకున్నందుకు థాంక్యూ. నా ప్రయాణం కూడా స్పెషల్‌గా చేసినందుకు థాంక్యూ’ అంటూ అందరికీ పేరుపేరునా థాంక్యూ చెప్పుకుంది రష్మిక మందనా. కాలికి గాయమయినా కూడా కుంటుకుంటూ ‘ఛావా’ ప్రమోషన్స్‌కు వెళ్లిన రష్మికకు ‘పుష్ప 2’ థాంక్యూ మీట్‌కు వెళ్లే టైమ్ లేదా అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.