BEL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమటెడ్ లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ, బీటెక్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.40,000 నుంచి రూ.55,000 వరకు వేతనం ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం.
ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) లో పలు తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 4న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 28
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
ప్రాజెక్ట్ ఇంజినీర్-1 పోస్టులు : 28
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి మెకానిక్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో బీఈ/బీటెక్ పాసై ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 4
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.472 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.
వయస్సు: 2025 మే 1 నాటికి 32 ఏళ్ల వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ జీతం ఉంటుంది. నెలకు రూ.40,000 నుంచి రూ.55,000 జీతం ఉంటుంది.
చిరునామా: అసిస్టెంట్ మేనేజర్- హెచ్ఆర్, మిలిటరీ కమ్యూనికేషన్ – ఎస్‌బీయూ, భారత్ ఎలక్ట్రానికల్స్ లిమిటెడ్, జలహల్లి పోస్ట్, బెంగళూరు- 560013 అడ్రస్ దరఖాస్తును పంపాలి.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://bel-india.in/job-notifications/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. మరి ఇంకెందకు ఆలస్యం. ఎలిజిబిలిటీ ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
Also Read: AP ICET Results: ఏపీ ఐసెట్ ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ -10 ర్యాంకర్లు వీళ్లే..
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 28
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 4
Also Read: AIIMS Recruitment: సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసే అవకాశం.. ఈ అర్హత ఉంటే చాలు భయ్యా..