నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగానికి చెందిన ప్రతిష్టాత్మక నవరత్న కంపెనీ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCF Ltd) లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మహారాష్ట్రలోని థాల్‌తో పాటు ట్రాంబే యూనిట్లలో ఖాళీగా ఉన్న 188 ఆపరేటర్ (కెమికల్) ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు ఇది గొప్ప అవకాశం. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 188
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ తర్వాత ఎన్‌సీవీటీ ద్వారా నిర్వహించే ఏఓసీపీ (Attendant Operator Chemical Plant) ట్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ప్రత్యామ్నాయంగా కెమికల్ ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
డిప్లొమా అభ్యర్థులు ఏడాది పాటు బీఓఏటీ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండటం తప్పనిసరి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ అలాగే ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయస్సు: అభ్యర్థుల వయసు 2026 ఫిబ్రవరి 1 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 33 ఏళ్ల వరకు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 35 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు.
జీతం, స్లైఫండ్ వివరాలు: ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ. 22,000 స్టైపెండ్ చెల్లిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి నెలకు రూ. 47,800 వేతనం లభిస్తుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఓబీసీ అభ్యర్థులు రూ. 700 ఫీజు చెల్లించాలి. ఎస్సీ తో పాటు ఎస్టీ అలాగే ఎక్స్‌సర్విస్‌మెన్ సహా మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
దరఖాస్తు ప్రక్రియ: అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఆర్‌సీఎఫ్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు: దరఖాస్తులు సమర్పించడానికి 2026 ఏప్రిల్ 24 చివరి తేదీగా నిర్ణయించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులు పరిగణించబడవు. పూర్తి వివరాల కోసం సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://rcfltd.com/
ALSO READ: భారత్ లోకి కొత్త టెస్లా కారు, సింగిల్ ఛార్జ్ తో 681 కి.మీ రేంజ్!