BigTV English

RRB JE: రైల్వేలో వేలల్లో జేఈ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే బంగారు భవిష్యత్తు మీ సొంతం, దరఖాస్తుకు ప్రారంభ తేది ఇదే

RRB JE: రైల్వేలో వేలల్లో జేఈ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే బంగారు భవిష్యత్తు మీ సొంతం, దరఖాస్తుకు ప్రారంభ తేది ఇదే

RRB JE: రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇండియన్ రైల్వేలో పలు రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న వారికి భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. డిగ్రీ లేదా బీఈ, బీటెక్ లేదా డిప్లొమా పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం  ఉంటుంది. ఈ ఉద్యోగం సాధిస్తే బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుంది. వేతనంతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, టీఏ ఇతర అలవెన్సులు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, వయస్సు, దరఖాస్తు విధానం, తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


ఇండియన్ రైల్వేలో రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు 2570 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. నవంబర్ 30న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 2570


రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.

విద్యార్హత: జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు మూడేళ డిప్లొమా కోర్సు(సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్) లేదా బీఈ, బీటెక్ డిగ్రీ పాసై ఉండాలి. డీఎంస్ ఉద్యోగాలకు ఏ విభాగంలో అయినా మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి. సీఎంఏ పోస్టులకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీతో బీఎస్సీ డిగ్రీలో కనీసం 45 శాతం మార్కులతో పాసై ఉండాలి.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 31

దరఖాస్తుకు చివరి తేది: 2025 నవంబర్ 30

జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి సాలరీ ఉంటుంది. నెలకు రూ.35,400 జీతం ఉంటుంది. డీఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సులు ఉంటాయి. రైల్వే ఉద్యోగులకు ఫ్యామిలీ ట్రైన్ పాస్, మెడికల్, విద్యా సాయం, NPS వంటి సదుపాయాలు కూడా ఉంటాయి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: సీబీటీ-1, సీబీటీ-2 ద్వారా ఉద్యోగానికి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.rrbapply.gov.in

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2570

దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 30

ALSO READ: AP RDMHS: ఏపీలో టెన్త్ క్లాస్‌ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.32,670 వేతనం, గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వొద్దు..

Related News

AP RDMHS: ఏపీలో టెన్త్ క్లాస్‌ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.32,670 వేతనం, గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వొద్దు..

Group-3 Selection List: తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్.. ప్రొవిజినల్ జాబితా విడుదల.. నేటి నుంచి వెబ్ ఆప్షన్స్

SSC Police: కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. దరఖాస్తు ప్రక్రియ షురూ, ఆలస్యం చేయకుండా..?

Bank Jobs: డిగ్రీ పాసైతే అప్లై చేసుకోవచ్చు.. భారీ వేతనం, ఇంకొన్ని గంటలే ఛాన్స్ బ్రో

JEE Main-2026: ఐఐటీ మెయిన్స్ అభ్యర్థులు అలర్ట్.. NTA కీలక సూచనలు

APSRTC: ఇది గోల్డెన్ ఛాన్స్.. ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలు, ఇంకా 4 రోజులే గడువు

AIIMS Mangalagiri: మంగళగిరిలో ఉద్యోగాలు.. ఒక్క ఇంటర్వ్యూతోనే జాబ్, రూ.1,50,000 జీతం

Big Stories

×